హైదరాబాద్ అన‌గానే.. మ‌న‌కు ముందుగా చార్మినార్, ఘుమఘుమలాడే బిర్యానీ.. వంటివి గుర్తుకొస్తాయి. అదే ఈ భాగ్య‌నగరంలో.. మృగశిర కార్తె అనగానే బత్తిని బ్రదర్స్‌ చేప ప్రసాదం గుర్తొస్తుంది. ఆస్తమా రోగులకు చేరువైన బత్తిని ఫ్యామిలి చేప మందు.. చేప ప్రసాదం గురించి తెలియని వారూ ఉండరు. అంతగా ఫేమస్‌ అయిన ఈ చేప ప్రసాదాన్ని బత్తిని ఫ్యామిలీ ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున అందిస్తోంది. ఈఏడాది కూడా జూన్‌ 8న.. చేప ప్రసాద పంపిణీ జరుగుతోంది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు సిద్ధం అయ్యారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని హరినాథ్‌ గౌడ్‌ తెలిపారు.

Related image

ఈ చేప ప్రసాదానికి 171 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 1847 నుంచీ కొనసాగుతోంది. నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాత బత్తిన వీరన్నగౌడ్‌ తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్‌ హయాంలో చేప ప్రసాదం పంపిణీ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు.

Related image

చేప ప్రసాదం పంపిణీ వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి వుంది. 1847 ప్రాంతంలో ఒక సాధువు బత్తిన వంశానికి చెందిన వీరన్నగౌడ్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. భారీ వ‌ర్షంలో తడిసిపోయిన వచ్చిన ఆ సాధువుకి వీరన్నగౌడ్ ఎంతో భక్తిగా సేవలు అందించారు. అందుకు మెచ్చి ఆ సాధువు ఆస్తమా మందు ఎలా తయారు చేయాలో చెప్పారు. అంతేకాదు, దాన్ని ఏటా మృగశిర కార్తె రోజున ఉచితంగా పంపిణీ చేయమని చెప్పి వెళ్లిపోయాడు. అప్పట్నుంచీ బత్తిని వంశీయులు శతాబ్దమున్నరకు పైగా విజయవంతంగా చేప ప్రసాదం రోగులకు అందిస్తూ వస్తున్నారు. 

Image result for fish medicine

చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. రెండు నుంచి మూడు అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదాలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30,45 రోజుల్లో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే సత్ఫలితాలిస్తుందని వారు చెబుతున్నారు.
ఔషధ గుణాలు కలిగిన ప్రసాదాన్ని చేప నోటిలో పెట్టి మింగడంతో అది కదులుతూ గొంతు ద్వారా జీర్ణాశయంలోకి వెల్లి జీర్ణకోశాన్ని శుభ్రం చేస్తుందంటున్నారు. అంతేకాకుండా నేరుగా జీర్ణాశయంలో జీర్ణం అవుతుండడంతో చేప ప్రసాదం త్వరగా రక్త ప్రసరణలో కలిసి శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుందంటున్నారు బత్తిని సోదరులు. 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: