జంగిల్‌బుక్‌లో మోగ్లీ గుర్తున్నాడా.. చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అడవిలో జంతువులతో కలిసిపెద్దవాడు అవుతాడు. జంతువుల అలవాట్లే అతడికి వస్తాయి. అచ్చం అటువంటి ఓ బాలికను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కనుగొన్నారు. ఆ బాలిక కోతి మూకకు ఏ వయసులో దొరికిందో, ఎక్కడ దొరికిందో తెలియదు. బాలికను ఎక్కడి నుంచి తీసుకు వెళ్లాయో, ఏమో కానీ ... ఆ కోతులు పాపను కంటికి రెప్పలా సాకాయి.



ఇప్పుడా పాప నాగరిక సమాజంలో చిక్కుకుని, దిక్కుతోచని స్థితిలో ఉంది. ఉత్తరప్రదేశ్ లోని కతార్నియాఘాట్ ఫారెస్ట్ ఎప్పటిలానే ఆరోజూ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ చిన్నారి కన్పించింది. ఆ పాప చేష్టలు చూసి ఫారెస్ట్ పోలీసులు షాక్ తిన్నారు. అచ్చంగా కోతిలా బిహేవ్ చేస్తున్న పాపను చూసి ఆశ్చర్యపోయారు. ఫారెస్ట్ పోలీసులను చూసి ఆ పాప భయపడింది. అచ్చంగా కోతిలానే ప్రవర్తించింది.అతికష్టం మీద బాలికను కాపాడి జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.


Image result for mogli

అయితే బాలిక మాట్లాడలేకపోతోందని.. ఏ భాషనూ అర్థం చేసుకోలేకపోతోందని వైద్యులు తెలిపారు. మనుషులను చూస్తే భయంతో పరుగు తీస్తోందన్నారు. రెండు కాళ్లతో పాటు చేతులనూ ఉపయోగించి నడుస్తోంది. చేతులతో తినకుండా, డైరెక్టుగా నోటితోనే ఆహారం తీసుకుంటోంది. ఆ పాపకు వైద్యులు చికిత్స ప్రారంభించారని, చాలా నిదానంగా రికవరీ వస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: