ప్రపంచంలో ఈ మద్య ఎవరి పని వారిది..పక్కవారికి కనీసం సహాయం చేయాలన్న జాలీ, దయా లేకుండా పోయాయి అన్నదానికి ఈ సంఘటన ఉదాహారణ.  ఎవరికైనా చిన్న ఆపద వస్తే వెంటనే సహాయం చేసి వారిని రక్షించాల్సిన బాధ్యత ఉందని మనం చదువుకునేటపుడు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు అది ఎవరు పాటిస్తున్నారు..తాజాగా న్యూయార్క్ సబ్ వేలో తలుపుల మధ్యతల చిక్కుకుని ఓ నడి వయసు మహిళ నరక యాతన అనుభవించింది. ఆ పక్క నుంచే పాదాచారులు నడుచుకుంటూ వెళ్తున్నారే తప్ప ఎవ్వరూ ఆమెను పట్టించుకోవడం లేదు.  

సబ్ వేలో తలుపుల మత్య తల చిక్కడంతో ఆమె గట్టిగా పిలవలేని పరిస్థితితో ఉన్నారు. ఎవరైనా సహాయం చేస్తారని దీనంగా చూస్తున్న ఆమెను కనీసం చూడనైనా చూడలేదు. మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టేషన్ అథార్టీకి చెందిన ఓ మహిళ యూనిఫామ్ లో ఆ పక్కనుంచే నడుచుకుంటూ వెళ్లిపోయినా.. తలుపుల మధ్య తల ఇరుక్కుని నరకయాతన పడుతన్న ఆ మహిళను పట్టించుకోనేలేదు.. 12 గంటల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటికే 12 లక్షల మంది చూశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: