కృషి..పట్టుదల వుండాలే కానీ చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు పిట్టా జనార్దన్‌. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 988 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. విజయనగరం జిల్లా గుడివాడ గ్రామానికి చెందిన పిట్టా మహాలక్ష్మణ, రాము దంపతుల కుమారుడు జనార్దన్‌ చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ చూపుతూ వచ్చాడు. భీమిలి దిసన్‌ స్కూల్‌లో ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు చదివి పదిలో 9.3 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఎమ్మెల్యే వాసుపల్లి గణే్‌షకుమార్‌ సహకారంతో వైజాగ్‌ డిఫెన్స అకాడమీలో ఎంపీసీ గ్రూపులో చేరి ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు 464 మార్కులు సాధించాడు.



ప్రస్తుతం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 530 మార్కులకు ఏకంగా 524 మార్కులు పొంది కళాశాలలోనే టాపర్‌గా నిలిచాడు. జనార్దన్‌ ప్రతిభపై తల్లిదండ్రులు మహాలక్ష్మణ, తల్లి రాము దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కష్టాలైనాపడి కుమారుడిని ఉన్నత చదువులు చదివించి ఉన్నతస్థాయిలో చూడాలనేదే తమ ఆకాంక్ష అంటూ ఆనందభాష్పాలు రాల్చారు. మహాలక్ష్మణ రాడ్‌ బెండింగ్‌ పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: