చాలా మంది డాక్టర్లు వైద్య వృత్తిని బిజినెస్ గా మార్చు కుంటుంటారు. కానీ, గంజాయి వనంలో తులసిమొక్కలా అన్నట్టు ఆమె మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పల్లెల్లో తిరుగుతూ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.పక్షవాతం, మూర్చవ్యాధులపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు కేరళకు చెందిన డాక్టర్ బిందుమీనన్. నెల్లూరులో ఓ ఆస్పత్రిలో న్యూరో విభాగంలో పనిచేస్తున్నారు. కేరళకు చెందిన బిందుమీనన్ ఎంబీబీఎస్ తో పాటు పలు ఉన్నత చదువులు చదివి విదేశాల్లో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ, మన దేశంలోని సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి స్విమ్స్ లో ఆరేళ్లు పని చేశారు.


ఆ తరువాత నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో న్యూరాలజీ డిపార్టుమెంట్ హెడ్ గా కొన్నేళ్లు పని చేశారు. బిందుమీనన్ కు లక్షల్లో జీతం, క్షణం తీరిక లేని వైద్యవృత్తి. అయినా సరే సెలవు వస్తే చాలు వ్యాను తీసుకుని మారుమూల కుగ్రామానికి వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. నాలుగు వందల మంది వృద్ధులు, పిల్లల్ని దత్తత తీసుకుని ఉచితంగా వైద్య సేవలు, మందులు పంపిణీ చేస్తున్నారు పెద్ద సంఖ్యలో.


అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వైద్య రత్న బిరుదులు అందుకున్నారు.పక్షవాతం మూర్చవ్యాధులుపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. బిందుమీనన్ వైద్యురాలిగా ప్రస్తావన మొదలయ్యాక ఎంతో మంది రోగులను చూసి చూసి అసలు రోగాలు రాకుండా ప్రివెన్షన్ తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన చేశారు. పక్షవాతం మూర్చవ్యాధులు బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.


ఉదయగిరి ఆత్మకూరు వెంకటగిరి నియోజక వర్గాల్లోనే కుగ్రామాల ప్రజలు ఎక్కువ గా పక్షవాతం మూర్చ వ్యాధికి గురవుతున్నారని డాక్టర్ బిందుమీనన్ గుర్తించారు. పక్షవాతం మూర్చవ్యాధులుతో బాధ పడుతున్న రెండు వందల యాభై మంది వృద్ధులు నూట యాభై మంది చిన్నారుల్ని దత్తత తీసుకున్నారు.వారికి ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తున్నారు. కాస్తంత ఖాళీ సమయం దొరికినా కాలేజీలు స్కూళ్లకు వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నారు.


ఇప్పటి వరకు 128 మెడికల్ క్యాంపులు, 93 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2013 లో డాక్టర్ బిందుమీనన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవలు విస్తృతం చేశారు.ఈ పది సంవత్సరాల్లో మేడంగారు వందమందిని దత్తత తీసుకొని ప్రతి నెలా వాళ్లకూ మందులిస్తూ వాళ్లకు ఏం కావాలో సర్వీస్ ఫ్రీగా చేస్తున్నారు.డాక్టర్ బిందుమీనన్ చేస్తున్న సేవల్ని గుర్తించిన పలు సంస్థలు ఆమెకి అంతర్జాతీయ, జాతీయ స్థాయి అవార్డులు అందించాయి.


ఇప్పటి వరకూ వైద్యరత్న వంటి బిరుదులతో పాటు 21 జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. డాక్టర్ బిందుమీనన్ చేస్తున్న సేవల్ని నెల్లూరు జిల్లాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్నో ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: