త‌ల లేకుండా కోడి బ‌తికింది అంటే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ.. అస‌లు ఇది నిజ‌మేనా అన్న ప్ర‌శ్న కూడా వ‌స్తుంది క‌దూ.. వాస్త‌వానికి ఇది నిజ‌మే. మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 10, 1945 న, కొలరాడోలోని ఫ్రూటాకు చెందిన రైతు లాయిడ్ ఒల్సేన్ చికెన్ వండుకోవాల‌ని మైక్ అనే ఐదున్నర నెలల వయసున్న కోడిని ఎంచుకుని ఇంటికి తీసుకువ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే దాన్ని చంప‌డానికి గొడ్డలితో తలపై న‌రికాడు.. కానీ దాని త‌ల‌ పూర్తిగా క‌ట్ కాక‌పోగా త‌ల నుంచి శ‌రీరానికి మెద‌డు సిగ్నెల్స్ పంపించే జ‌గ్ల‌ర్ వెయిన్ క‌ట్ అవ్వ‌క‌పోవ‌డంతో ఆ కోడి లాయిడ్ ద‌గ్గ‌ర నుంచి త‌ప్పించుకుంది.


అలాగే ఓ చెవి మరియు మెద‌డు కూడా చాలా వరకు మైక్ మెడ‌తో పాటే ఉండిపోయింది. త‌ప్పించుకున్న మైక్ అరుపులు విన్న త‌ర్వాత లాయిడ్ దాన్ని చంపాల‌నుకోలేదు. దాన్నికి ఐ డ్రాప‌ర్ స‌హాయంతో నీళ్లు, పాలు అందించేవాడు.  అలాగే చిరు ధాన్యాల‌ను అందించ‌డం స్టార్ట్ చేయ‌డంతో మైక్ బ‌తికింది. క్ర‌మ‌క్ర‌మంగా ఆ కోడి వార్త అమెరికా అంత‌టా పాకిపోయింది. కొంద‌రు ఇది నిజం కాద‌ని న‌మ్మ‌క‌పోయిన‌ప్ప‌టికీ మైక్‌ను చూడ‌డానికి తండోప తండాలుగా వ‌చ్చేవారు.


వండ‌ర్ మైక్ గా అమెరికా అంత‌టా పాపులారిటీని సంపాదించుకుంది. అయితే త‌ల లేని మైక్‌ను చూడాలంటే 25 సెంట్లు అంటే ఇప్పుడు రూ. 15లు ఇవ్వాల‌ని లాయిడ్ కండీష‌న్ పెట్టాడు. కానీ జ‌నాలు మాత్రం మైక్ చూడ‌డానికి వ‌స్తూనే ఉండేవారు. మైక్  మార్చి 17, 1947 న  గొంతులో క‌ణితి కార‌ణంగా తిన‌డానికి క‌ష్ట‌త‌ర‌మై చనిపోయింది. 18 నెల‌ల పాటు త‌ల లేని కోడిగా జీవించి త‌న‌కంటూ ఓ చ‌రిత్ర‌ను సృష్టించుకుంది మైక్. అలాగే మైక్ కార‌ణంగా లాయిడ్ కూడా నెల‌కు రూ. 35,87,284 సంపాదించుకునేవాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: