తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, గ్రాఫిక్స్ పరంగా ఈ చిత్రం ఎంతో అద్భతంగా ఉందని సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ బాహుబలిని మాత్రం ఓ క్రిటిక్ ఘోరంగా అవమానించాడు. వివాదాస్పద మూవీ రివ్యూలతో పాపులర్ అయిన కమల్ తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ బాహుబలి-2ని టార్గెట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ -2 సినిమాను రివ్యూ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
బాహుబలి ఫస్ట్ పార్ట్ ఎంతో కొంత బాగుంది కానీ సెకండ్ పార్టీ అస్సలు బాగోలేదని అసలు బాహుబలి 1 లో కనీసం 10 పర్సెంట్ కూడా బాగోలేదని ఘాటు విమర్శలు చేస్తున్నాడు. బాహుబలి చిత్రాన్ని మాత్రమే కాకుండా ప్రభాస్ ని సైతం విమర్శిస్తున్నారు . ప్రభాస్ ఒంటె లా ఉన్నాడని అతడ్ని బాలీవుడ్ లో ఏ దర్శక నిర్మాత కూడా తీసుకోరని , ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఇడియట్స్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు కమాల్ ఆర్ ఖాన్ .
అయితే రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, ప్రభాస్ బాగా నటించారని చెప్పాడు. ఈ సినిమాకు వన్ రేటింగ్ ఇచ్చాడు. బిజినెస్ రేటింగ్ మాత్రం 8 ఎనిమిది ఇచ్చాడు. ఈ సినిమాకు ఇచ్చిన హైప్ కారణంగా 2నుంచి 3 వందల కోట్లు వసూలు చేస్తుందని వ్యాఖ్యానించాడు. ఫ్రీ పబ్లిసిటీ ని విపరీతంగా కోరుకునే ఇతగాడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించాడు .
ఇలా అవమానించడం వల్ల మీడియాలో ప్రముఖంగా కనిపిస్తాడు కాబట్టి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడని కూడా ఇతడి పై విమర్శలు ఉన్నాయి .ప్రభాస్ ని ఒంటె తో పోల్చడంతో హర్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ కమాల్ ఆర్ ఖాన్ పై విరుచుకు పడుతున్నారు .