మొన్నామధ్య వచ్చిన "రాజా ది గ్రేట్"సినిమా లో కళ్లు కనిపించకున్న హీరో తన పగను ఎలా తీర్చుకున్నాడో ".అలా కనిపించకున్నా,చెవులు వినిపించకున్నా.. 130కి పైగా దేశాలు చుట్టేశారు."టోనీ గైల్స్"

అంటార్కిటికాతో  సహా ప్రపంచంలోని ప్రతి ఖండాన్నీ సందర్శించాను. ప్రపంచంలోని దేశాలన్నీ  చుట్టేయ్యడమే తన లక్ష్యం" అని టోనీ గైల్స్ పేర్కొన్నారు.

మీరు ఇంతగా దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు అని కొందరు చెప్తున్నప్పటికి తాను వినకుండా వెళ్తూనే ఉంటారని కళ్లు కనిపించకున్నా, చెవులు వినిపించకున్నా తమదైన దృష్టితో ప్రపంచాన్ని చూడటమే తన లక్ష్యం అని 41 ఏళ్ల టోనీ చెప్పారు.

ఇటీవల తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో కూడా వారు పర్యటించారు.

పర్వతాల మీదికి వెళ్తారు, జాగ్రత్తగా దిగుతారు.టోనీ చర్మం, కాళ్ళ ద్వారా అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తారంట.తాను ఒక దేశాన్ని అలానే చూస్తారంట. తేడాలను గమనిస్తారు.మార్పులను గమనిస్తారు.

టోనీ గత 20 ఏళ్లుగా అనేక కొత్త ప్రదేశాలను సందర్శించారు.

ఒక పర్యటనలో ఆయన తన గ్రీకు గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా కలుసుకున్నారు. ఆమెకు కూడా చూపు లేదు.

గత ఏడాది ఆమెతో కలిసి రష్యా వెళ్లారు. వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యాను రైలులో చుట్టేశారు.

కానీ, చాలా ప్రయాణాలలో ఆయన ఒంటరిగానే వెళ్తారు.ఈ ప్రయాణాల కోసం ఆయన తండ్రి పెన్షన్ డబ్బులు ఖర్చు పెడుతుంటాడట ఎక్కడికి వెళ్లాలన్నా చాలా ముందుగానే ప్లాన్ చేస్తారు.

విమానం టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఆయన తల్లి సహాయం చేస్తుంటది అంట. ఎందుకంటే, చాలా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లలో చూపులేనివారు సొంతంగా టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు లేదని వారు చెప్పారు.

తను వెళ్లాలనుకుంటున్న ప్రదేశంలో తనలాంటి వారికి సాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కొని వారికి తనదైన సహాయం చేస్తూ నలుగురుని కలుపుకొని పోతు జీవితాన్ని గడిపేస్తుంటారు టోనీ...ఇతని జీవితాన్ని ఒక ఆదర్శంగా మనందరం తీసుకుందాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: