మనిషి సంఘ జీవి. తాను ఒక్కడూ బతకలేడు.  ఎంత ఆస్తి ఉన్నా మరెంత మంది వెనకాల ఉన్నా తన మదిలోని భావాలను చెప్పుకునేందుకు ఓ నేస్తం కావాలి. ఆ నేస్తమే అసలైన ఆస్తి. ఒక్క మిత్రుడు ఉంటే చాలు లోకాలు జయించవచ్చు. అంటే దీని అర్ధం ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు అన్నింటీనీ ధైర్యంగా ఎదుర్కోవచ్చునన్న మాట. 



నేస్తం కట్టేది మనసును చూసి. మనిషిని చూసి కానే కాదు. ఆ స్నేహానికి పెద్ద, చిన్న తారతమ్యం ఉండదు. అలాగే ఆడా  మగా తేడా అంత కంటే లేదు. చదువు ఉన్నదీ లేనిదీ అసలు చూడదు. మనసు నుంచి మనసుకు ముడి వేసి ఇద్దరినీ ఒక్కటిగా చేసేదే స్నేహం. ఓ తరగతిలో బాగా చదువుకున్న విధ్యార్ధి ఉంటాడు. అతనితో స్నేహం చేస్తే తనలాగానే చదువుకోవడం ఏంటన్నది చెబుతాడు. ఎలా మంచిగా ఉండాలో  నేర్పిస్తాడు.


ఓ సంస్కారవంతుని స్నేహం మరొకరి జీవితానికి స్పూర్తిదాయకం. అలాగే వ్యసనపరున్ని కూడా నిజమైన మిత్రుడు మంచి వాడిగా మార్చేందుకు క్రుషి చేసి విజయవంతమవుతాడు. స్నేహం అంటే ఇదేరా అనిపించేవి ఈ జగతిలో ఎన్నో వున్నాయి.


దుర్యోధనుడు  కర్ణుని స్నేహం అటువంటిదే. వారిద్దరిదీ కాలాలకు అతీతామైన స్నేహ భావన. ఏం చూసి కర్ణున్ని హితుడా అని పిలిచాడో నిజంగా సుయోధనునికి కర్ణుడు హితుడిగానే ఉన్నాడు. తన జీవితాన్నే అర్పించాడు.  అందుకే  మరి మిత్రుడంటే అలా ఉండాలి అంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: