దోస్తీ అన్నది అద్భుతమైనది. అద్వితీయమనది. అతి తీయనైనది. ప్రపంచం ఎంత వేగంగా మారినా మారనిది చెక్కు చెదరనిది, తరగని నిధి స్నేహమే. ఓ సినీ కవి పాటలో రాస్తాడు. మంచు సైతం వేడి సెగలు రగిలించినా, మల్లె పూలు నల్లగా వాడిపోయినా నేస్తం  మాత్రం మారడు అని. ఆ చెప్పుకున్న రెండు ఉదాహరణలూ ప్రక్రుతికి సంబంధించినవి. ప్రక్రుతి తన ఆక్రుతి మార్చుకుని విక్రుత రూపం  ధరించవచ్చును గాక, స్నేహం మాత్రం చెక్కు చెదరదు. అంతే కదా మరి.



ఒక మంచి స్నేహితుని నుంచి మిత్రుడు కోరుకునేది ఏమీ ఉండదు, చక్కని చిక్కని చిరునవ్వు మాత్రమే. అంటే ఆ చిరునవ్వు చాలన్న మాట. ఇతను దేన్ని  అయినా జయించేయగలడన్న నమ్మకాన్ని కలిగించేందుకు. రెండు అత్మలుట, ఒకటే  దేహమట. అదే కదా అచ్చమైన స్నేహం అంటారు. అంటే ఈ భూమి మీదకు రాక ముందే దెవుడి దగ్గర అనుమతి తీసుకుని మరీ ఇద్దరుగా వచ్చి ఇక్కడ ఒక్కటవుతారన్న మాట. ఇలా కూడా అందంగా స్నేహం గురించి చెప్పుకుంటారు.



స్నేహం గురించి ఎంతగా తరచి చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. చాలా మంది అద్దె ఇళ్ళలో ఉంటారు. ఎపుడోసారి వాటిని ఖాళీ  చేయాల్సి వస్తుంది. అపుడు చుట్టు పక్కల స్నేహాలు వీడిపోలేక పడే బాధ వర్ణనాతీతమే. ఆ స్నేహం కోసం మళ్ళీ అక్కడికి వస్తూనే ఉంటారు. కానీ పక్కనే లేమన్న దిగులు, అంటే కాలం మొత్తం స్నేహానికి ఇచ్చేయాలన్న తపన. ఇలాంటివి ప్రతి మనిషి నిత్య జీవితంలోనూ కనిపిస్తాయి. అందుకే వెల కట్ట లేనిది స్నేహం మాత్రమే ఈ భువిలో. అన్న మాట అక్షర సత్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: