మ‌నం ప్ర‌తిరోజూ రెండు మూడు న్యూస్ పేప‌ర్లు తెప్పిస్తుంటాం. అయితే వాటిని కొంత మంది హెడ్‌లైన్స్ చ‌దివి ప‌క్క‌న పడేస్తారు. మ‌రికొంత మంది సినిమా న్యూస్ చ‌దువుతారు, ఇంకొంత‌మంది స్పోర్ట్స్ చ‌దువుతారు ఇలా ఒకొక్క‌రు ఒక్కోటి చ‌దువుతారు. కానీ ప్ర‌తిరోజూ కూడా న్యూస్ పేప‌ర్‌లో ఏదో ఒక సెన్సేష‌న‌ల్ న్యూస్ మాత్రం త‌ప్ప‌కుండా ఉంటుంది. దాన్ని మనం గ‌మ‌నించాలి. ముఖ్యంగా త‌ల్లిదండ్రులు న్యూస్ పేప‌ర్ చ‌దివేట‌ప్పుడు గ‌మ‌నించాల్సింది. ఏదో ఒక మంచి విష‌యం..లేదా మంచి వ్య‌క్తి గురించి..ఇన్‌స్పైరింగ్ విష‌యం ఇలాంటివి ఖ‌చ్చితంగా వ‌స్తాయి. అలాగే ఎన్నో ఇన్‌స్పైరింగ్ క‌థ‌లు కూడా ఉంటాయి. అవి చ‌దివి వాటి గురించి పిల్ల‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా చెప్పాలి నేర్పించాలి. ఆ క‌థ‌లోని నీతి గురించి వివ‌రించాలి. అప్పుడు అస‌లు న్యూస్ పేప‌ర్ అంటే ఏంటి. అందులో ఆ వ్య‌క్తుల గురించి ఎందుకు ఇస్తున్నారు. అలాగే వాళ్ళ‌ను ఇన్‌స్పైరింగ్‌గా తీసుకోమ‌ని అలా చ‌ద‌వాల‌ని. అలా వృద్ధిలోకి రావాల‌ని ఇలాంటివ‌న్నీ పిల్ల‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా చూపించి నేర్పించాలి. 

 

దాని వ‌ల్ల వాళ్ళ‌కి చిన్న‌ప్ప‌టి నుంచే రీడింగ్ అనేది ఒకటి అల‌వాటు అవుతుంది. అంతేకాక అలా ఇన్‌స్పైర్ అయ్యే వ్య‌క్తుల నుంచి కొన్ని విష‌యాల‌ను కూడా నేర్చుకోవ‌డానికి ట్రై చేస్తారు. వాళ్ళ మ‌న‌సులో కూడా అలా ఇన్‌స్పైర్ అయ్యే భావం క‌లుగుతుంది. ఉదాహ‌ర‌ణ ఒక‌బాలుడు డ‌బ్బులు లేక చ‌దువుకోవ‌డం లేదుని ఏదో ఒక క‌థ ఉంటుంది. దాన్ని చ‌దివి వివ‌ర‌ణ ఇవ్వాలి చెప్పాలి. స‌మాజంప‌ట్ల పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న నేర్పాలి. డ‌బ్బులు ఎంత విలువైన‌వి, చ‌దువు ఎంత విలువైన‌ది అన్న‌ది తెల‌పాలి. అందులోని నీతిని చెప్పాలి. ఎదుటివారికి స‌హాయం చేసే గుణ‌గ‌ణాల‌ను చూపించాలి. ఎవ్వ‌రికీ హానీ చెయ్య‌కూడ‌ద‌న్న‌ది తెల‌పాలి. నిజాయితీగా ఉండ‌డం నేర్పించాలి. 

 

ఇలాంటివి రోజూ మ‌నం చ‌దివే న్యూస్ పేప‌ర్ నుంచే పిల్ల‌ల‌కు చాలా వ‌ర‌కు మ‌నం నేర్పించ‌వచ్చు వీటిని కాస్త జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే బావుంటుంది. అలాగే ఎడ్యుకేష‌న్ పేజ్ కూడా ఉంటుంది. అందులో జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌కి సంబంధించి ఉంటుంది. దాని పైన అవ‌గాహ‌న క‌ల్పించాలి. ఇక ప‌రీక్ష‌ల స‌మ‌యంలో రిజ‌ల్ట్ కూడా పేప‌ర్‌లో ఇస్తారు. ఆ మ‌రుస‌టి రోజు ఫ‌స్ట్ సెకండ్ వ‌చ్చిన విద్యార్ధుల ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తారు. అలాగే ప‌రీక్ష‌ల స‌మాయంలో క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు ఇస్తారు. ఇక వీట‌న్నిటిపైన పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు ఒక అవ‌గాహ‌న క‌ల్పించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: