పెళ్లయిన యువతిలకు కడుపులో ఒక బిడ్డ కానీ పడితే వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. కాస్త అజాగ్రత్తగా ఉన్నా దాని ప్రభావం పుట్టబోయే బిడ్డపై చూపుతుంది. ఇంట్లో ఉండే వస్తువులు కూడా గర్భంలో ఉన్న బిడ్డపై ప్రభావం చూపుతాయని ఎన్నో ప్రముఖ మెడికల్ సర్వేలలో తేలింది. ప్రత్యేకంగా కొన్ని వస్తువులను అసలు ఇంట్లో ఉంచకూడదని ప్రముఖ డాక్టర్లు సూచించారు. అవేంటో మనం ఈ ఆర్టికల్ ద్వారా ఒకసారి తెలుసుకుందాం. 

IHG


ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వివాహితులు మద్యం కాఫీ లాంటి పానీయాలకు దూరంగా ఉంటూ చురుకైన జీవన శైలిని కొనసాగిస్తే... పుట్టబోయే బిడ్డపై మంచి ప్రభావం పడుతుంది. అలాగే మీ ఇంట్లో గోడలకు వేసే రసాయనిక పెయింట్ నుండి వచ్చే వాసన కారణంగా గర్భవతులపై మహా చెడ్డ ప్రభావం పడుతుంది. గర్భంలో పెరుగుతున్న శిశువు త్వరగా పుట్టడానికి కూడా గోడల పెయింటింగ్ కారణమని ఓ సర్వేలో తేలింది. అందుకే ప్రీ బర్త్ లాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలంటే గర్భం ధరించిన ఆడవారి ఇంట్లో కొత్తగా పెయింటింగ్ వెయ్యకండి. దోమల నివారణ మందులను, జెట్ కాయిల్, ఆల్ అవుట్ ఇంకా ఇతర స్ప్రే లను అసలు వాడకండి. 

 

IHG


ఇవన్నీ హానికరమైనవి కావు అని వాటికవే సర్టిఫికేట్లు ఇచ్చుకున్నప్పటికీ... వాస్తవానికి వీటిలో ఉండే రసాయనాలు మనుషులపై ముఖ్యంగా పుట్టబోయే శిశువుపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతాయి. కీటకాలను ఇతర వాసనలను పోగొట్టుకునేందుకు చాలామంది నాఫ్తలీన్ బాల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి గర్భిణీ స్త్రీలకు తలనొప్పులు తెచ్చి పుట్టబోయే బిడ్డపై విషంగా మారుతాయి. ప్లాస్టిక్ వస్తువులకు కూడా కాస్త దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. ఎందుకంటే శరీరకాంతి వస్తూనే వెంటనే గ్రహిస్తుంది. దీనివల్ల పుట్టబోయే శిశువుపై నెగిటివ్ ప్రభావం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: