పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్నిశక్తివంతులుగా తయారుచేయాలనే కోరికతో పిల్లల్నిఅనేక ఇబ్బందులకు గురిచేస్తుంటారు. వారు తాము జీవితంలో ఏమి సాధించలేని విషయాలను తమ పిల్లలు సాధించాలని కోరుకుంటారు.

 

ఆ  లక్ష్యాన్ని సాధించటానికి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అత్యంత కఠినంగా కూడా ప్రవర్తిస్తారు. మరికొందరు తల్లిదండ్రులు తమ చాలా గారాబంతో తమ పిల్లల్ని ఈ లోకంలో అప్రయోజకులుగా చేస్తున్నారు. ప్రతి పిల్లలకు ఒక్కో స్థాయిలో శ్రద్ధ, ప్రేమ, క్రమశిక్షణ అవసరమవుతాయి. పిల్లలు సరిగ్గా ఎదగడానికి అనువైన వాతావరణాన్ని సమకూర్చడంలో తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మీ అంతరంగంలోనూ, మీ ఇంట్లోనూ ఆనందం, ప్రేమ, భద్రత, క్రమశిక్షణలతో కూడిన వాతావరణాన్నికల్పించుకోవాలి.

 

తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. తల్లిదండ్రులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. మీకు నలుగురు సంతానం ఉంటే నలుగురు ఒకేలా ఉండరు. నలుగురి మనస్తత్వం వేర్వేరుగా ఉంటుంది. మీరు చేయవలసినదల్లా పిల్లల ఎదుగుదలకు కావలిసిన ప్రేమ, సహాయం అందజేయడమే. పిల్లల తెలివితేటలు సహజంగా ఎదగడానికి ప్రేమపూర్వకమైన వాతావరణాన్నికల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. మీ పిల్లల జీవితము చాలా నిర్మలమైనది, స్వచ్ఛమైనది.తల్లిదండ్రులు ఉదయాన్నేపిల్లల్నిస్కూలుకు వెళ్ళేటప్పుడు చాలా తొందరపెడుతుంటారు. కారణం పిల్లలు టైమ్‌కి అన్నీ చేయాలని, క్రమశిక్షణగా ఉండాలని, మంచి పిల్లలు అనిపించుకోవాలని వాళ్ళ తాపత్రేయం.

 

 

అన్నీటైమ్ టేబుల్ ప్రకారం జరగాలనుకునే మీరు మీ పిల్లలకు ఎప్పుడైనా టైమ్ ఆఫ్ ఇచ్చారా? చదవడానికి, రాయడానికి మాత్రమే కాదు మీతో మాట్లాడానికి, ఆట్లాడానికి కబుర్లు చెప్పడానికి మీ టైమ్ టేబుల్‌లో సమయం ఎక్కడ కేటాయించారని ఆలోచించండి. ఇప్పుడున్న పిల్లలకు ఈ పసితనం ఈ స్కూల్ టైమ్‌ల వల్ల ఎప్పుడో మాయం అయిపోయింది.పిల్లలతో ప్రతి తల్లితండ్రులు కొంచెం సమయం గడపండి.చదువు ఒక్కటే ప్రపంచంలా కాకుండా కొంచెం బయట వాతావరణం అలవాటు చేయండి. పిల్లల్ని అప్పుడపుడు అయినా ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించండి.. !

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: