ప్రతి తల్లితండ్రులు పిల్లల విషయంలో చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. ఏమయిందిలే అని తేలికగా తీసుకుంటే అది వాళ్ళ భవిష్యత్ మీద ప్రభావం చూపుతుంది . పిల్లలు మీ ముందు భయపడాలన్న భావనను వదిలంచుకోవాలి. మీ ఆధిపత్యాన్ని వారిపై చూపించవద్దు. అమ్మాయిని ఒకలాగ, అబ్బాయిని మరో రకంగా చూడకూడదు. అపరిచితుల ముందు, పిల్లలకంటే చిన్నవారి ముందు వాళ్లను తిట్టటం, కొట్టటం లాంటివి చేయక పోవటం మంచిది.తిట్టినా కొట్టిన ఆ ప్రభావం పిల్లలు మీద పడుతుంది.నా తల్లితండ్రులుకు నేనంటే ఇష్టం లేదు అన్నా భావనలో ఉండిపోతారు 

 

 మిగతా పిల్లల్లో ఉండే గొప్పదనాన్ని అస్తమానం మీ చిన్నారులకు గుర్తు చేస్తూ.. వారిని హేళన చేయటం తగదు. తెలిసో తెలియక పిల్లలు చేసే ప్రతి ప్రయత్నాన్నీ ఖండించవద్దు. "నీకేం తెలియదు పో" అంటూ కసురుకోకూడదు. అలాగే అబ్బాయి లేదా అమ్మాయి అడిగిందల్లా కొనివ్వటం, అతిగారాబం మంచిది కాదు.

 

 "ఇది తినొద్దు, అది తినొద్దు.. మీకు పడదు" అంటూ పిల్లల్ని అన్నింటికీ దూరంగా ఉంచితే అది వారి ఆరోగ్యం పాలిట అనారోగ్యమై కూర్చుంటుంది. ప్రతి విషయంలోనూ వారికి ఏదీ దక్కకుండా నియంత్రించి.. అదుపులో ఉంచాలని చూస్తే, వాటిని దక్కించుకునేందుకు పిల్లలు అబద్దాలు, దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది.

 

 అతి ముఖ్యమైన, విలువైన పత్రాలు, వస్తువులు పిల్లల చేతికి అందేలా ఉంచవద్దు. జాగ్రత్తగా మీరే పెట్టుకోవాలి.  పిల్లలు ఏం మాట్లాడినా ముద్దుగానే ఉంటుంది. కానీ వాళ్లకు అశ్లీల పదజాలం, బూతు మాటలు అలవాటవకుండా జాగ్రత్తపడాలి. అతిగా గారాబం చేసే, బూతు మాటలు నేర్పించేవారి వద్దకు పిల్లల్ని చేరనీయకూడదు.ఇంట్లో భార్య భర్తలు కూడా భుతుపదజాలం వాడకూడదు.. హానికరమైన  లిక్విడ్స్, ఆసిడ్స్, బాత్రూమ్ క్లీనర్లు, మందులు,సిరప్ లు పిల్లలకు దూరంగా ఉంచండి.మీరు అజాగ్రత్తగా ఉంటే పిల్లలు అవి తాగే ప్రమాదం ఉంది. అందుకనే పిల్లలకు అందకుండా పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: