చాలా మంది తల్లిదండ్రులు పిల్ల‌లు స‌న్న‌గా ఉన్నార‌ని బాధ‌ప‌డుతుంటారు. మా పిల్ల‌లు లావు అవ్వ‌డంలేద‌ని పిల్ల‌లు చాలా ఉన్నార‌ని అంటుంటారు. కానీ పిల్ల‌ల్లో చూడ‌వ‌ల‌సింది లావు, స‌న్నగా ఉండ‌డం కాదు వారు యాక్టివ్‌గా ఉన్నారా లేదా అన్న విష‌యాన్ని గ‌మ‌నించాలి. లావుగా ఉన్న పిల్ల‌లు అంత చ‌లాకీగా ఉండ‌రు..ఉండ‌లేరు. అదే స‌న్న‌గా ఉన్న పిల్ల‌లైతే చాలా యాక్టివ్‌గా ఉంటారు. కాని త‌ల్లిదండ్రులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌కుండా మా పిల్ల‌లు స‌న్న‌గా అయిపోతున్నారు అని వైధ్యుల‌ను సంప్ర‌దించిన సంద‌ర్భాలు అనేకం అని చెప్పాలి. ఇక అలాగే కొంత మంది పిల్ల‌లు అధిక బరువు ఉన్న‌ప్ప‌టికీ కొంత‌మంది పెద్ద‌గా ప‌ట్టించుకోరు దాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. అదే అనేక ర‌క‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్త‌ద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

 

మరి పిల్లల్లో అధిక బరువు సమస్యను అధిగమించడం ఎలాగంటే...పిల్లల బరువు అధికంగా పెరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు వీటిని త‌ప్ప‌కుండా పాటించాలి. ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని గతేడాది ఓ అధ్యయనంలో తెలిపింది. దేశంలో దాదాపు కోటి 40 లక్షల మంది పిల్ల‌లు ఉండ‌గా అందులో అధిక బ‌రువు ఉన్న పిల్ల‌లు చైనా ప్రథమ స్థానంలో ఉండగా.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ఈ సమస్య అధికంగానే ఉంది.

 


పిల్లల్లో అధిక బరువును గుర్తించడానికి సులువైన మార్గం వాళ్ల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పరిశీలించడం. అలాగే దాని ద్వారా పిల్లల బరువు మ‌రియు వారి  వయసుకు, ఎత్తుకు తగ్గట్టుగా ఉందా? లేదా ఎక్కువ, తక్కువ ఉందా? అన్నది ఖ‌చ్చితంగా గ‌మ‌నించాల్సిన ప‌రిస్థితి. సాధారణంగా ఎనిమిదేళ్ల వయసు నుంచే బాలికల్లో అధిక బరువు సమస్య మొదలయ్యే అవకాశం ఎంతైనా  ఉందని చెప్పాలి. సాధారణ వ్యక్తులతో పోల్చితే ఊబకాయంతో బాధపడుతున్న మహిళకు పుట్టే బిడ్డకు (అమ్మాయి) అధిక బరువు సమస్య 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని కూడా పరిశోధకులు గుర్తించారు. అలాగే తండ్రి అధిక బరువుంటే, వారి మగ పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం 6 రెట్లు అధికంగా ఉంటుంది.

 

 అలాగే బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ లాంటి ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంద‌ని చెప్పాలి. పిల్ల‌లు తీసుకునే ఆహారం పై త‌ల్లిదండ్రులు ఎక్కువ శ్ర‌ద్ధ చూపించాలి. బ్యాక‌రీ ఫుడ్ ఎక్కువ‌గా పెట్ట‌కూడ‌దు. ఫాస్ట్ ఫుడ్ ని ఎప్పుడ‌యితే ఇష్ట‌ప‌డ‌తారో అప్పుడే క‌ట్టడిచేయాలి.  రోజూ ఖ‌చ్చితంగా వాకింగ్ చేయించాలి. అలాగే ఇంట్లో కూడా తామే చేసుకోగ‌లి ఏ పైనైనా తానే చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: