పిల్లలు చిన్న వారిగా ఉన్నప్పుడే వారికి కొన్ని అలవాట్లు సెట్ చేసినట్లయితే తల్లిదండ్రులు వారి జీవితానికి మంచి పునాది వేసినవారు అవుతారు. సభ్యత ,సంస్కారం తో పాటుగా మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేయాలి .వారి ప్రతి అకేషన్ కి మంచి పుస్తకాలను గిఫ్ట్ గా ఇవ్వడం అలవాటు చేయండి.వారి ఫ్రెండ్స్ కి కూడా పుస్తకాలనే గిఫ్ట్ గా ఇవ్వడం అలవాటు చేయాలి.పుస్తకాలు చదవడం అలవాటు ఉన్నవారికి ఏకాగ్రత మరియు నిర్ణయాలు తీసుకోవడంలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మామూలు వ్యక్తుల కన్నా మానసికంగా బలంగానూ మరియు ప్రత్యేకంగా ఉంటారు

 

మానసిక ఆందోళనను తగ్గించుకో గలుగుతారు. అలాగే మానవ సంబంధాలను చక్కగా పెంచుకోగలుగుతారు.పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో అనేక విషయాలను గురించి అవగాహన కలిగి ఉంటారు. కనుక వారు ఎలాగైనా అభివృద్ధి సాధించగలరు. పుస్తకాలు చదవడం ద్వారా వచ్చే జ్ఞానమే వారిని సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా నిలుపుతుంది. పుస్తక పఠనం ద్వారా పిల్లలకు అనేక రకమైన కొత్త విషయాలు తెలుస్తాయి.

 

ఈ లాక్ డౌన్ సమయంలో అందరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి పిల్లలకి తల్లితండ్రులు దగ్గర ఉండి పిల్లల్ని చదివించండి. మనం ఎంత చదివామన్నదాని కన్నా ఎంత జ్ఞానం సంపాదించామన్నది ముఖ్యం. దీనికి మంచి ఉదాహరణ దివంగత తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలిత చదివినది పదవ తరగతి మాత్రమే. ఆమెకున్న పుస్తక జ్ఞానమే ఆమె ప్రపంచంలోనే ఒక ఉన్నత మహిళగా గుర్తింపు పొందగలిగింది.పిల్లలకు పుస్తకాలు చదవటం అలవాటు చేస్తే వల్ల ద్యాస వేరేవాటి మీద పోకుండా ఉంటుంది... !ఈ కాలం పిల్లలు ఎంత సేపు ఫోన్లో ఆటలు ఆడుకోడం యు ట్యూబ్ లో వీడియోలు చూడడం, లేదంటే టీవీ లో కార్టూన్లు చూడడం అలవాటు పడిపోయారు. దీనివల్ల వల్ల కళ్ళకి, మెదడుకు హాని తప్ప ప్రయోజనం లేదు. అందుకే పుస్తకాలు చదవడం అలవాటు చేయండి. "మంచి పుస్తకాన్ని మించిన మిత్రుడు ఎవరు లేరు "...!

మరింత సమాచారం తెలుసుకోండి: