చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే అని పిల్లల్ని బుజ్జగించేదుకు తల్లిదండ్రులు నానా పాట్లూ పడటం మామూలే. అయితే ఏదో బలమైన కారణాలు ఉన్నప్పుడు నసపెట్టి మారాం చేసే  పిల్లలతో చిక్కు లేదు. కానీ అలవాటుగా నస పెట్టే పిల్లలందరినీ జాగర్తగా గమనిస్తే నస ప్రవర్తనకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి.

 

అందులో మొదటి కారణం పెంపకంలో లోపం కాగా రెండవ కారణం పిల్లలకు నిద్ర చాలక పోవటం.పిల్లల ఎదుగుదలను తిండి తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, మెదడు వికసించటం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. నిద్ర విషయంలో పెద్ద వారి లాగే పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగిన పిల్లల్లో ఎదుగుదల సమస్య లతో పాటు ప్రవర్తనలో కూడా తేడా కన పడుతుంది. అయితే తేడా చంటి పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది. పెద్ద పిల్లల్లో మరో రకంగా ఉంటుంది.

 

చంటి పిల్లలు అయితే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు అదే పెద్ద పిల్లలు నస పెడుతుంటారు.కారణం లేకుండా ఏ చంటి బిడ్డ అయినా నస పెడుతుంటే ముందుగా ఆలోంచాల్సింది బిడ్డకు నిద్ర చాల లేదని, ఎదిగే పిల్లలకు రోజుల తరబడి నిద్ర తక్కువ అయినప్పుడు శరీర పెరుగుదల కూడా మందగిస్తుంది.ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు అందరి లోనూ నిద్ర గంటలను తగ్గటానికి కారణాలు అవుతున్నాయి. టీవీ సంస్కృతి వచ్చాక చాలా మంది పిల్లలు వారికి వారుగా త్వరగా నిద్ర పోరు. సెలవుల్లో అయితే ఫరవా లేదు. కానీ బడి ఉన్నప్పుడు వారిని పొద్దునే నిద్రలేపి పంపాల్సి వుంటుంది. అలాంటప్పుడు వారికి నిద్ర చాలదు.పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను చాలా చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. రాత్రి భోజనం అయ్యాక వారితో కబుర్లాడటం, నిద్ర పోవటానికి ముందు పళ్లు తోము కోవటం, స్నానం చేయించటం, పడక దుస్తులు తొడగటం లాంటివి ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో చేయించాలి.

 

పడక మీదకు చేరానే బొమ్మల పుస్తకాలు తిరగెయ్యటం, కథలు చెప్పించుకోవటాన్ని ప్రోత్సహించాలి. ఈ పనులన్నీ ఒకదాని తరువాత ఒకటిగా వరుస క్రమం మారకుండా ప్రతి రోజూ చేయించాలి. ఈ మొత్తం ప్రహసనం కనీసం అర గంటకు తక్కువ కాకుండా ఉండాలి. ఇలా చేయించటం వల్ల ఆ పని మొదలు పెట్టినప్పటి నుండి వారికి తెలియ కుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా చేయటం వల్ల వారిలో నిద్ర వేళలు గట్టి పడతాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: