కొంతమంది పిల్లలు చూడడానికి బొద్దుగా ముద్దుగా ఉంటారు. కానీ మరి లావు అయితే మాత్రం చాలా ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే బరువు  నియంత్రణలో ఉంచేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలనే దానిపై వైద్య నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు.

పిల్లలతో పాటే కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేచోట కూర్చుని తినేందుకు ప్రయత్నించాలి.స్వీట్లు, తియ్యటి పానీయాలు తీసుకోకూడదు.ఎప్పుడూ ఇంట్లో వండిన పదార్థాలనే తినేందుకు ప్రయత్నించాలి.సమతుల పోషకాహారం తీసుకోవాలి.చిన్నపిల్లలు ప్రతి రోజూ 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా అని ఒకేసారి విరామం లేకుండా చేయకూడదు. 5 నుంచి 10 నిమిషాల చొప్పున రోజులో పలుమార్లు చేయాలి.

 

 

చిన్నప్పటి నుంచే పిల్లలకు సైకిల్ తొక్కడం అలవాటు చేయాలి.చాలావరకు పిల్లలు తియ్యని పానీయాలు, స్వీట్లు అంటే అమితాసక్తి చూపిస్తారు. కానీ.. చక్కెరను నియంత్రణలో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు.ఆహారంలో రోజూ పండ్లు, కూరగాయలు ఇవ్వాలి.కూరగాయలు, పండ్లు కలిసిన రసాలను రోజులో 150 మిల్లీ లీటర్లకు మించకుండా ఇవ్వవచ్చు.భోజనం తినేందుకు పిల్లలకు పెద్దలు తినే ప్లేట్లను ఇవ్వకూడదని, అలా ఇస్తే వాళ్లు అవసరానికి మించి ఆహారం తినేందుకు ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు.అలాగే ప్లేటులో ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టకుండా, అడుగుతుంటే కొద్దికొద్దిగా పెట్టాలి.

రోజూ ఒకే సమయానికి తినేలా అలవాటు చేయాలి.సరిపడా నిద్ర పోకపోవడం కూడా అధిక బరువుకు దారితీస్తోందనితక్కువ సమయంపాటు నిద్రపోతున్న పిల్లల్లో ఏడేళ్ల వయసులోనే బీఎంఐ అధికంగా పెరుగుతోందని గుర్తించారు.

 

 

 

పిల్లలు రోజులో రెండు గంటలకు మించి టీవీ చూడకూడదని నిపుణులు చెబుతున్నారు.

నిvద్రపోయేటప్పుడు వారి ముందు టీవీ, స్మార్ట్ఫోన్, వీడియో గేమ్ లాంటి ఎలక్ట్రానిక్ తెరలు లేకుండా చూడాలి.చిన్నతనం నుంచే పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి.అయితే... ఎక్కువగా తింటే లావైపోతావు, అందవిహీనంగా తయారవుతావు అనే మాటలు మాత్రం అనకూడదు. అలా అంటే ఆ పదార్థాలను పిల్లలు మరింత ఎక్కువగా తినాలని అనుకుంటారని నిపుణులు అంటున్నారు.టినేజీ పిల్లలతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే టీనేజీ పిల్లల్లో కొందరు లావైపోతామని భయపడి తినడం మానేసి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: