పిల్లలను పెంచడం అనేది కొంత విచక్షణతో కూడిన విషయం. ఒక్కొక్కరకమైన పిల్లలకు ఒక్కోరకమైన  శ్రద్ధ, ప్రేమ, కాఠిన్యం అవసరం. అయితే తల్లి తండ్రులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలిసిన విషయాలు ఏంటంటే  మీ ద్వారా వచ్చిన ఈ గారాల పట్టి, మీ ఇంట్లో నడయాడుతుండడం మీ భాగ్యమని తెలుసుకోండి. పిల్లలు మీ ఆస్తి కాదు,  మీ సొంతం కాదు. వారిని పెంచడంలో, వారికి ప్రేమాదరణలు చూపడంలో పొందే ఆనందాన్ని గురించి మాత్రమే ఆలోచించండి. మీ భవిష్యత్తుకు వారిని పెట్టుబడిగా చేయకండి.వారికి ఏమికావాలని ఉందో, అదే కానివ్వండి.జీవితంలో మీరు చేసినవే, మీ బిడ్డ చేయనవసరం లేదు. పిల్లలు పిల్లలుగానే ఉండడం చాలా ముఖ్యం. వారిని పెద్దవారిగా చేయడానికి తొందర లేదు. ఎందుకంటే తరువాత వారిని తిరిగి పిల్లలుగా చేయలేరుగా. 

 

పిల్లలు, పిల్లచేష్టలు చేస్తుంటే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళు పెద్దయ్యాక పిల్లచేష్టలు చేస్తే, అది బాగుండదు. పిల్లలు, పెద్దవారవడానికి తొందరేం లేదు.భయాందోళనలతో కూడిన వాతావరణాన్ని మీరు సృష్టిస్తే, మీ పిల్లలు ఆనందంగా ఎలా ఉండగలరు? వాళ్ళు కూడా అవే నేర్చుకుంటారు. ప్రేమ, ఆనందాలతో కూడిన వాతావరణాన్ని సృష్టించడమే మీరు చేయవలసినది.యజమానిలా పిల్లలపై మీ అధికారం చలాయించడం మాని, ఒక గాఢమైన స్నేహాన్ని సృష్టించండి. అంతేగాని వల్ల మీద అధికారం చెలాయించవద్దు. పిల్లల కంటే కపిల్లలకు మంచి పెంపకం ఇవ్వాలని మీకు నిజంగా ఉంటే, ముందు మిమ్మల్ని మీరు శాంతస్వరూపులుగా, ప్రేమ మూర్తులుగా ఉండాలి. 

 

పిల్లలు అనేక విషయాల మూలంగా ప్రభావితులవుతారు  టీ.వీ, ఇరుగు పొరుగు వాళ్ళు, అధ్యాపకులు, పాఠశాల, ఇంకా లక్షలాది విషయాలు. వాటిలో, వారికి ఆకర్షణీయంగా కనబడిన వాటి వైపే వారు వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమిటంటే, తల్లి తండ్రులతో గడపటమే పిల్లలకు అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉండేట్లు, మిమ్మల్ని మీరు తీర్చి దిద్దుకోవాలి. మీరు సంతోషమైన, తెలివితేటలున్న, అద్భుతమైన వ్యక్తి అయితే, మీ పిల్లలు మరెవరితే సహచర్యం కోరుకోరు. ఏమి కావాలన్నా వాళ్ళు మీ దగ్గరికే వచ్చి అడుగుతారు.మీతో ప్రేమగా మాట్లాడతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: