ఎండాకాలం ప్రారంభం నుండే ఎండ ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం కనపడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు, వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. లేదంటే తలనొప్పి, ఒళ్లుమంట, డీ హైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు

 

ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్లు వాడాలి.తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి.పలుచని బట్టలు వేయాలి.ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు సన్వూస్కీన్లోషన్లు వాడాలి.చిన్న పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి.

 

సాధారణంగా వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని సమయాల్లో ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రాణాలను కూడా కోల్పోతుంటారు. కాబట్టి వృద్ధులు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఆచర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.హార నియమాలనుంచి నిద్ర వరకు వైద్యుల సలహాలు పాటించాలి.అలాగే  వీలయినంత వరకు పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్లకుండా ఉండడమే మంచిది.అలాగే వీలయినన్ని మంచినీళ్లు తాగించండి. చెమట రూపంలో శరీరంలో ఉన్న ద్రవాలు అన్ని బయటకు పోతాయి అందుకనే వేసవి కాలంలో ద్రవ పదార్ధాలు తీసుకోవడం మంచింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: