‌చిన్న పిల్లలు  వేసవి కాలంలో చాలా జాగ్రత్తలు వహించాలి. అసలే ఎండలు విపరీతంగా వేస్తున్నాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్ని వేసవి కాలంలో వచ్చే ఇబ్బందులనుండి కాపాడుకోవచ్చు. పిల్లలు వేసవిలో శీతలపానీయాలు తీసుకొనరాదు, దానికి బదులుగా పళ్లరసాలు, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవడం మంచిది. ఎండదాటికి అందరు ఫ్రిజ్జుల్లోని ఐస్ నీళ్ళు తాగుతున్నారు. ఇవి ఆకలిని మరింత తగ్గిస్తాయి కనుక ఈ కాలంలో కుండలో పోసిన చల్లని నీళ్ళను మాత్రమే తాగాలి.
మనం తీసుకొనే ఆహారం విషయంలో  మరింత జాగ్రత్తలు వహించాలి. ఎక్కువగా ఉప్పగా, ఎక్కువ కారంగా ఉండే ఆహారాలు శరీరంలో వేడిని కలగ చేస్తాయి దినివల్ల విరేచనాలు అయి మీరు బలహీన పడతారు కనుక  ఉప్ప, కారంను  తీసుకొనే ఆహారం లో తక్కువ మోతాదులో వాడుకోవాలి.ఈ మధ్య వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి, బయటకు వెళ్ళడం చాల కష్టంగా ఉంటుంది. ప్రధానంగా 12 గంటల నుండి 4 గంటల వరకు ఎండలో తిరగక పోవడం ఉత్తమం.  పిల్లల్ని  బయటకు తీసుకుని  వెల్లసిన అవరసం వచ్చినపుడు, మీతో పాటు నీళ్ల సీసా, జ్యూస్ ని తీసుకొని వెళ్ళండి మరియు పిల్లల  శరీరాన్ని కవర్ చేసేలా  తలకు , మెడకు  కాటన్ గుడ్డతో కప్పుకోవాలి లేదా   టోపీ పెట్టుకోవాలి, లేదు అంటే గొడుగు తీసుకొని వెళ్ళండి, సన్ గ్లాసెస్ ధరించండి.నలుపురంగు బట్టలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి కాబట్టి గట్టి బట్టలు మీ శరీరం పై చెమటనివ్వదు, వదులుగా ఉండి, కాంతి రంగు బట్టలు ధరించాలరీరలో ఎక్కువ శాతం నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది దేని కారణంగా డిహైడ్రాషన్ కి గురివుతారు, కాబట్టి  ఎక్కువగా నీరు త్రాగడం అవసరం లేదా నీటి శాతం పుష్కలంగా ఉన్న పుచ్చకాయ, కీరదోస, చెరుకు ముక్కల్ని కూడా తరచుగా తీసుకోవచ్చు వీటిలో నీరు శాతం అధికంగా ఉంటుంది కావున డిహైడ్రాషన్ నుండి బయట పడవచ్చు.వేసవికాలం లో వ్యాధులు రావడానికి ప్రధాన కారణం నీరు, కనుక నీళ్లు ఉపయోగించేటప్పుడు తగు చర్యలు తీస్కతనం చేస్తే ఉడుకు పొక్కులు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: