ప్రతి ఇంట్లో పిల్లల మీద అమ్మలు చెప్పే కంప్లైంట్ ఒకటే రాత్రిళ్ళు పిల్లలు పక్క తడపడం అని.  సాధారణంగా పసిపిల్లలు తరచుగా పక్కతడుపుతుంటారు. ఈ సమస్య పిల్లలు ఒక నిర్ధిష్టమైన వయస్సుకు వచ్చేవరకు కొనసాగుతుంది. అయితే, కొందరు పిల్లలు 6 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా, ఈ అలవాటును కొనసాగిస్తూ ఉంటే అది ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశంగానే ఉంటుంది.అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుండి బయటకు పడవచ్చు. సహజ సిద్దమైన ఫైబర్ సమృద్ధిగా ఉండే వాల్ నట్స్ మరియు కిస్ మిస్ లు మీ బిడ్డ పక్కతడిపే సమస్యను నిరోధించడానికి సూచించదగిన మరో సమర్థవంతమైన గృహ చిట్కాగా ఉంటాయి వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది,. తృణధాన్యాలు పిల్లల్లో నీటి నిలుపుదల సామర్ధ్యాన్ని పెంచడానికి దోహదపడగలవు.

 

ఓట్స్, పుడ్ రైస్, కార్న్ ఫ్లేక్స్ లేదా గోధుమ పొట్టు వంటి ధాన్యాలు మీ బిడ్డ పక్కతడిపే సమస్యను సమర్ధవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి.అరటిపండ్లు మరో ప్రసిద్ది చెందిన అద్భుతమైన గృహ చిట్కాగా చెప్పబడుతుంది. ఇవి జీర్ణ వ్యవస్థకు సహకారాన్ని అందివ్వడమే కాకుండా, మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడంలో ఉత్తమంగా సహాయపడగలదని చెప్పబడింది. అయితే, రాత్రిపూట అరటిపండ్లను తీసుకోవడం మూలంగా కఫం చేరే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, సాయంత్రం వేళల్లోనే అరటిపండును ఇవ్వడం మంచిదిగా సూచింపబడుతుంది.దాల్చిన చెక్క మరియు తేనెలో ఉండే గుణాలు పిల్లల్లో పక్క తడిపే అలవాటును నివారించడంలో ఎంతగానో సహాయపడగలవని చెప్పబడుతుంది. పిల్లల్లో పక్క తడిపే అలవాటును తగ్గించడంలో, తులసిని పూర్వీకుల వైద్యంగా చెప్పబడుతుంది.

 

 

కొన్ని తులసి ఆకులను వేయించి, తేనెతో కలిపి, ఇవ్వడం మూలంగా, సమస్య పరిష్కారానికి సహాయపడగలదని చెప్పబడుతుంది. తులసిలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు, మూత్రాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది.అలాగే స్వీట్లు మరియు చాక్లెట్ల తయారీలో ఉపయోగించే కృత్రిమ రాసాయలనాలు, చక్కెరలు పిల్లలలో రాత్రి సమయంలో కొన్ని జీవక్రియలకు దారితీయవచ్చు. క్రమంగా మీ బిడ్డ పక్కతడిపే అలవాటును కలిగి ఉండవచ్చు కూడా. కావున మీ బిడ్డ పడకకు ఉపక్రమించే ముందు, స్వీట్లు లేదా చాక్లెట్ల జోలికి వెళ్ళడంలేదని నిర్ధారించుకోవడం మంచిదిగా సూచించబడుతుంది.అలాగే పిల్లల్ని నిద్రకి వేసేటపుడు ఒకసారి టాయిలెట్ పోయించి పడుకోబెట్టండి.అలాగే మధ్య రాత్రిలో కూడా ఒకసారి లేపి బాత్రూమ్ కి వెళ్లడం అలవాటు చేయించండి.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: