మీ పిల్లలు లావై పోతున్నారని చింతించకండి. అలాగే అధిక బరువును నిర్లక్ష్యం కూడా చేయవద్దు.  అది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. మరి పిల్లల్లో అధిక బరువు సమస్యను అధిగమించడం ఎలా అనేది ఒకసారి చూద్దాం.. అలాగే తండ్రి అధిక బరువుంటే, వారి మగ పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం 6 రెట్లు అధికంగా ఉంటుంది.పిల్లలతో పాటే కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేచోట కూర్చుని తినేందుకు ప్రయత్నించాలి.స్వీట్లు, తియ్యటి పానీయాలు తీసుకోకూడదు.బయట అధిక కొవ్వు పదార్ధాలు ఉండే వాటిని అసలు తినకూడదు  అవి చూడడానికే బాగుంటాయి.. అందులోను రుచికోసం అనేక రకాలైన పదార్థాలను కలుపుతారు.

 

ఎప్పుడూ ఇంట్లో వండిన పదార్థాలనే తినేందుకు ప్రయత్నించాలి.సమతుల పోషకాహారం తీసుకోవాలి.చిన్నపిల్లలు ప్రతి రోజూ 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా అని ఒకేసారి విరామం లేకుండా చేయకూడదు. 5 నుంచి 10 నిమిషాల చొప్పున రోజులో పలుమార్లు చేయాలి.సాధారణ బరువున్న పిల్లల కంటే అధిక బరువు కలిగినవారు ఎక్కువగా వ్యాయామం చేయాలని కొందరు భావిస్తారు. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లలకు చదువు ఒక్కటే వ్యాపకంలాగా కాకుండా ఆటలు కూడా ఆడించాలి. ఆటలు ఆడడం వాళ్ళ శరీరంలోని అన్ని భాగాలు సంకోచిస్తాయి. చిన్నప్పటి నుంచే పిల్లలకు సైకిల్ తొక్కడం అలవాటు చేయాలి.చాలావరకు పిల్లలు తియ్యని పానీయాలు, స్వీట్లు అంటే అమితాసక్తి చూపిస్తారు. కానీ.. చక్కెరను నియంత్రణలో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఆహారంలో రోజూ పండ్లు, కూరగాయలు ఇవ్వాలి.కూరగాయలు, పండ్లు కలిసిన రసాలను రోజులో 150 మిల్లీ లీటర్లకు మించకుండా ఇవ్వవచ్చు.భోజనం తినేందుకు పిల్లలకు పెద్దలు తినే ప్లేట్లను ఇవ్వకూడదని, అలా ఇస్తే వాళ్లు అవసరానికి మించి ఆహారం తినేందుకు ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు.అలాగే ప్లేటులో ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టకుండా, అడుగుతుంటే కొద్దికొద్దిగా పెట్టాలి.రోజూ ఒకే సమయానికి తినేలా అలవాటు చేయాలి.తక్కువ సమయంపాటు నిద్రపోతున్న పిల్లల్లో ఏడేళ్ల వయసులోనే బీఎంఐ అధికంగా పెరుగుతోందని గుర్తించారు.

 

పిల్లలు రోజులో రెండు గంటలకు మించి టీవీ చూడకూడదని నిపుణులు చెబుతున్నారు.నిద్రపోయేటప్పుడు వారి ముందు టీవీ, స్మార్ట్ఫోన్, వీడియో గేమ్ లాంటి ఎలక్ట్రానిక్ తెరలు లేకుండా చూడాలి.చిన్నతనం నుంచే పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి.అయితే... ఎక్కువగా తింటే లావైపోతావు, అందవిహీనంగా తయారవుతావు అనే మాటలు మాత్రం అనకూడదు. అలా అంటే ఆ పదార్థాలను పిల్లలు మరింత ఎక్కువగా తినాలని అనుకుంటారని నిపుణులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: