పసి పిల్లలు దేవుడితో సమానం అని అంటారు. అలంటి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినాగానీ నోరు తెరిచి చెప్పలేరు. మనమే కొన్ని జాగ్రతలు వహించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. చంటి బిడ్డలు చర్మవ్యాధుల బారిన పడకుండావుండాలంటే వారికి నేత వస్త్రాల(కాటన్ బట్టలు)నే వాడండి.పిల్లలకోసం ఏ వస్తువులైనా కొనే ముందు వాటి కంపెనీ వివరాలు, అది తయారైన తేదీ, వాటిని వాడవలసిన విధానాలను తప్పనిసరిగా చదివి ఆ తర్వాత వాడండి.

 


 మీ చంటి పిల్లవాణ్ని ఎట్టి పరిస్థితులలోనూ ఎదిగే పిల్లల చేతికి ఇవ్వకండి. వారు చంటిపిల్లలతో ఆడుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ, ఆ ఉత్సాహంలో వారేం చేస్తారో వారికే తెలీదు.ఇంట్లో ఎల్లప్పుడూ ప్రథమ చికిత్స(ఫస్ట్ ఎయిడ్)కు సంబంధించిన మందులు ఉంచుకోవాలి.
చంటి పిల్లలను ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూడాలి. ముక్కు, చెవులలో నూనెను పోయకూడదు, ఇది ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుందంటున్నారు వైద్యులు.
అధిక రసాయనాలు కలిగిన సబ్బులు, కాస్మొటిక్ పదార్థాలను పిల్లలకు వాడకూడదు. ఇవి పిల్లలకు చర్మ వ్యాధులకు గురిచేస్తాయి.

 

పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కనీసం ఒక క్షణంకూడా వారిని ఒంటరిగా వదలకండి.పిల్లల్లో చిన్న-చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ మీ సొంత వైద్యం వాడకండి. వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.తల్లి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అదికూడా మీరు స్వయంగా చంటి పిల్లలకు పాలు ఇస్తున్నట్లైతే మరీ ఎక్కువగా శ్రద్ధ కనపరచాలంటున్నారు వైద్యులు.చంటి పిల్లలు నాలుగు నెలల వయసుకు చేరుకునే వరకు తల్లులు తప్పనిసరిగా పాలను ఇవ్వాలి. వేసవికాలంలో అధికంగా వేడివున్నప్పుడు ఎక్కువగా నీరు ఇవ్వకూడదంటున్నారు వైద్యులు.
పిల్లలు బాటిల్ పాలు తాగేవారైతే వారిని ఒంటరిగా వదలకూడదు. అందులోని పాలపీకనుకూడా వారు మింగేసే ప్రమాదంవుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఆ పాలసీసాను కూడా వేడి నీటితో ఎప్పటికప్పుడు శుభ్రం చేసి తాజా పాలు పాయలు. నిల్వ పాలు ఉపయోగించకూడదు. నిల్వ పాలు పట్టిన, బాటిల్ సరిగా కడగక పోయిన పిల్లలకు వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలకు డైపర్లు వాడుతుంటే బాత్రూమ్ కి వెల్లినవెంటనే తీసేయండి. అవసరమైతే తప్ప డైపర్లు వాడకండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: