క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19 ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో వ్యాప్తిచెందుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే.. ప్ర‌తిరోజు న‌మోదు అవుతున్నా క‌రోనా లెక్క‌లే చెప్పేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు సంఖ్య 62 ల‌క్ష‌లు దాటేసింది. అదే స‌మ‌యంలో 3.74 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కాటుకు బ‌లైపోయారు. మ‌రోవైపు ఈ ప్రాణాంత‌క‌ర మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించారు. దీంతో పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌లు కూడా ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలోనే త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌పై ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

 

ఇందులో ముఖ్యంగా పిల్ల‌ల ఆరోగ్యం. టైమ్ టు టైమ్ వారినికి సైర‌న పోష‌కాహారం అదించ‌డం చాలా ముఖ్యం. అలాగే ఈ లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోడానికి సెల్ఫ్-స్టడీని మించింది లేదు. క్లాస్ లో చెప్పిన విషయాలని రివైండ్ చేసుకోవడానికి గానీ, కొన్ని వర్క్ షీట్స్ చేసుకోవడానికి గానీ ఇది సరైన సమయం. ఇక ఇవన్నీ విద్యార్ధులకి కొత్తేమీ కాదు. స్కూల్స్ నడుస్తున్నప్పుడు అందరూ చేసినవే. అయితే ఆ అలవాటు తప్పకుండా చూసుకోవడం త‌ల్లిదండ్రుల బాధ్యత.

 

ఇక పిల్ల‌లు మామూలు పుస్తకాలు చదవడానికి సమయం సరిపోవట్లేదు అంటూ ఉంటారు. అందుకే ఈ లాక్ డౌన్ సమయాన్ని అందుకు ఉపయోగించుకునేలా త‌ల్లిదండ్రులు చేస్తే వారికి ఉత్సాహంగా కూడా ఉంటుంది. ఇక ఈ లాక్‌డౌన్ ఎఫెక్ట్ పిల్ల‌ల‌ మీద మరీ ఎక్కువగా ఉంది. అందుకే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో వారు ఆందోళనకు గురి కాకుండా చూస్కోవాలి. కుటుంబంతో సమయం ఎక్కువగా గడపడం, స్నేహితులతో సామాజిక మాధ్యమాల ద్వారా కబుర్లు చెప్పుకునేలా చేయాలి. అప్పుడు వారి మైండ్ రీఫ్రెష్ అవుతుంది. అలాగే పిల్ల‌ల‌ను ఏదైనా ఒక ఆన్‌లైన్ కోర్స్ లో చేర్పించ‌డానికి ఇది సరైన సమయం. అయితే ఆ కోర్స్ వాళ్ళ చదువుకు సంబంధించినదే కానకర్లేదు. వాళ్ల‌కు దేనిపై ఇంట్రెస్ట్ ఉంటే.. దానికి సంబంధించిన కోర్స్ నేర్పించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: