వేసవి కాలం అంటే ఎండలు మండిపోతాయి. పిల్లలు పెద్దలు అందరు ఇంటికే పరిమితం అవుతారు. పిల్లలు అయితే ఎండ దాటి తట్టుకోలేక చాలా అనారోగ్యాల పాలవుతారు  సాధారణంగా సంవత్సరంలో వేసవికాలం మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది.  ఈ ఎండ ప్రభావం పిల్లలు మీద పడకూడదు అని,  భారతదేశంలోని పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలు వెచ్చని వాతావరణం నుండి విరామం తీసుకోవడానికి వేసవి సెలవులు కల్పించాయి. వేసవి నెలల్లో వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. ఇలాంటి కాలంలో చిన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండలు వల్ల వచ్చు అనారోగ్య సమస్యలు  ఏంటో చూద్దాం

 

వేసవికాలంలో పిల్లలపై ఎండ యొక్క ప్రభావం శరీరంపై పడుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గి, వడ దెబ్బ వస్తుంది. అందుచేత ఎక్కువగా  పిల్లల్ని బయట తిరగనివ్వడం  మంచిది కాదు. సాధ్యం అయిన అంతవరకు బయటకు వెళ్లినపుడు ద్రవ పదార్ధాలు తీసుకోవడం తప్పనిసరి, రోజు కంటే 2-3 లీటర్లు నీరు త్రాగడం వల్ల శరీరం డిహైడ్రాషన్ అవకుండా ఉంటుంది. పళ్ల రసాలు, మజ్జిగ మరియు ఓఆర్ఎస్ పిల్లలకు పట్టడం మంచిది. అధిక ఉష్ణోగ్రతల యొక్క దీర్ఘకాలిక స్పందన ఫలితంగా శరీర ఉష్ణోగ్రతల పెరుగుదల వడ దెబ్బకి దారి తీస్తుంది. తలనొప్పి, వికారం, మైకము, వేగవంతమైన హృదయ స్పందన మరియు జ్వరం వంటివి పిల్లల్లో కనిపిస్తాయి.

 

అతిసారం, వాంతులు వేసవికాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఆహారం త్వరగా చెడిపోతుంది.ఈ ఆహారం పిల్లలు తినడం వల్ల చాలా నష్టాలు వస్తాయి.  కలుషితమయైన  ఆహారం వల్ల అతిసారం, వాంతులు వస్తాయి. అతిసారం ఉంటే  రోజుకి 2 లేదా 3 సార్లు నీళ్ల విరేచనాలు అవుతాయి, కడుపులో ఉన్న చెడు ఆహారం వాంతులు రూపంలో బయటకు వస్తుంది.ఈ వ్యాధి నుండి బయటపడానికి పిల్లలకు 
కాచి చల్లరిచిన నీరు త్రాగడం, వంటలో తాజా కూరగాయలను ఉపయోగించాలి మరియు నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకొనరాదు.

 

వేసవిలో, చర్మం దద్దుర్లు పిల్లలు మరియు పెద్దలలో కనిపించే ఒక సాధారణ చర్మ సమస్య.  చర్మం దద్దుర్లు కి ముఖ్య కారణం చెమట, ఇవి శరీరంలో ఎక్కడ అయినా రావచ్చు.దీనిని  నివారించడానికి పిల్లల  శరీరంని  శుభ్రంగా ఉంచాలి , దీర్ఘకాలం పాటు చెమట దుస్తులును ధరించడం ధ్వార చర్మం దద్దుర్లు వస్తాయి కాబట్టి శుభ్రంగా ఉతికిన బట్టలు పిల్లలకు ఉపయోగించాలి. మంచి వేసవిలో పత్తి దుస్తులను ఉపయోగించడాం శ్రేయస్కారం.గవదబిళ్లలు వేసవిలో వచ్చే అత్యంత అంటువ్యాధి మరియు ఈ  వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మనిప్పుడు లేదా దగ్గినప్పుడు అతని నుండి మరో వ్యక్తి తొందరగా సోకుతుంది.  దీనివల్ల గవదల్లో తీవ్రమైన వాపు, నొప్పి మరియు జ్వరం వస్తాయి. MMR టీకా అనేది గవదబిళ్లలకు  వ్యతిరేకంగా పోరాడుతుంది.  ఈ టీకా మిమల్ని మరియు మీ పిల్లలుని అంటువ్యాధికి గురికాకుండా రక్షించడంలో సహాయపడుతుంది.అందుకనే పిల్లల్ని ఎండాకాలం ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: