పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందుకే పిల్లలకు మొదటి స్నేహితులు, గురువులు కూడా  తల్లితండ్రులే. ఇక సాధార‌ణంగా తల్లిదండ్రులు ఎలా ఉంటే.. పిల్లల ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత ఆధారంగా పిల్లలను చిన్న వయస్సు నుంచే సక్రమంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అలా అని పిల్లలను ప్రతీ చిన్న విషయానికి కఠినంగా శిక్షించకూడదు. ప్రేమ ఆప్యాయతతో వారి మనస్సులలో మార్పుతీసుకురావాలి.

 

అయితే తల్లిదండ్రులు తెలిసో తెలియకో ఒక్కోసారి పిల్లలతో కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు. కానీ, ఒక్కోసారి ఆ మాట‌లు పిల్ల‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయి. మ‌రి పిల్ల‌ల ముందు అస్స‌లు మాట్లాడ‌కూడ‌ని మాట‌లు ఏంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. కంపారిజన్. పిల్లల్ని ఇంకోకరితో కంపేర్ చెయ్యడమంటే వాళ్ళని లెక్కలేకుండా చూడడం. వాళ్ళెంత ట్రై చేసినా పేరెంట్స్ వాళ్ళని మెచ్చుకోరని వాళ్ళకి అర్ధమైపోతుంది. ఇది పిల్ల‌ల జీవితంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. అలాగే చిన్నప్పటి నుండీ నువ్వు ఇది కావాలి? అలా చేయాలి? అనే లక్ష్యాన్ని పెట్టడం వలన వారి ఇష్టాలను, సంతోషాలను మీరు లాగేసుకున్నవారవుతారు. 

 

రేపు పెరిగి పెద్దయ్యాక వారు ఏమీ సాధించలేకపోతే మీరే కారణమవుతారు. పిల్లలకు డబ్బు విలువ, మనుషుల విలువ, ప్రేమ, ఆప్యాయతలు తెలియడం మంచిదే. అంతేకానీ ప్రతిసారీ వారికి మన పరిస్థితి, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం అని చెప్పడం వ‌ల్ల వారి దృష్టి అంతా డ‌బ్బుపైనే ఉంటుంది. అదేవిధంగా, నీకది కొనిస్తా, అది చేస్తా, నెక్స్ట్ టైం డెఫినిట్ గా అక్కడుంటా... లాంటి మాటలు అంటారు కానీ చెయ్యరు చాలా మంది పేరెంట్స్. మీరు తీర్చలేని ప్రామిస్ లు చేయకండి. ఎందుకంటే ఇలా చేయ‌డం వ‌ల్ల పిల్లలు మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. నువ్వెందుకూ పనికిరావు, నీకు ప్రతీదీ పదిసార్లు చెప్పాలి, నువ్వొక ఫెయిల్యూర్, నీ అంత స్టుపిడ్ ని నేనెక్కడా చూడలేదు.. ఇలాంటి మాట‌లు  పిల్లల మనసుల మీద చెరగని ముద్ర వేస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: