తల్లి తండ్రులనుంచి ముఖ్యంగా వచ్చే కంప్లైంట్ మా పిల్లలు సరిగా అన్నం తినడం లేదని. అయితే చాలామంది పిల్లలు ఆహారం తినడానికి ఆసక్తి చూపరు. దీంతో బలహీనంగా, బక్కపలుచగా ఉంటారు. తల్లులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు ఆహారం మాత్రం తినరు.అదే పొటాటో  చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్  మాత్రం వద్దన్నా తింటుంటారు. చిరుతిండ్లు తినడానికి వచ్చే ఆకలి అన్నం తినడానికి రాదు పిల్లలకు. అందుకనే పిల్లలకి సరయిన సమయంలో, సరైన రీతిలో ఆహారంను పెట్టాలి. వాళ్ళకి ఎప్పుడు ఒకేలా అన్నం, టిఫిన్ కాకుండా కొంచెం వెరైటీగా వండిపెట్టాలి. 

 


ముఖ్యంగా  పిల్లలను చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. వీటికి బదులుగా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్‌లను డైరెక్ట్‌గా కాకుండా వాటికి నీరు, పాలు, వెన్న కలిపి ఇవ్వడం వల్ల ఇష్టంగా తింటారు. ఫ్రూట్ జ్యూస్‌లను ఇష్టపడని పిల్లలకు ఆపిల్, బనానా, జామ, సపోటా పండ్లను చిన్న ముక్కలుగా కోసి ఇస్తే ఇష్టంగా తింటారు.చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు పోషకాహారం అందించాలనుకుంటారు. కానీ ఆ పోషక పదార్థాలు మాత్రం తెలియవు. వాల్‌నట్స్, డ్రైఫ్రూట్స్, ఎగ్, వెన్న రాసిన చపాతీలు, బాదాం పప్పు, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు తినిపించడం వల్ల ఆకలి పెరుగడంతో పాటు పిల్లల  ఆరోగ్యం కూడా  బాగుంటుంది.

 

 

ఆకలి మందగించిన పిల్లలకు అరటిపండును బాగా గుజ్జుగా చేసుకొని తినిపించవచ్చు. లేదా అందులో కాస్త పాలు, కొంచెం చక్కెర కలిపి తినిపించవచ్చు. ఇలా చేస్తే ఆకలి కూడా పెరుగడంతో పాటు  పోషకాలు కూడా పిల్లలకు  అందుతాయి.అలాగే పిల్లలు ఏడ్చినా వెంటనే చాక్లెట్స్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు.అసలు ఇవ్వకుండా ఉండకండి అనికూడా కాదు.సందర్భాన్ని పట్టి పిల్లలకు ఇవ్వాలి.రెండు పూటలా పిల్లలకు గోరువెచ్చని పాలు తాగించడం వల్ల శరీరంలోని ఎముకలు, కండరాలు దృడంగా మారతాయి. పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడకపోగే పాలల్లో హార్లిక్స్, బూస్ట్స్ గాని లేదా వేరే ఎమన్నా ఫ్లేవర్స్ కలిపి ఇవ్వడం వల్ల ఇష్టంగా తాగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: