ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదర్చిన వివాహమైనా.. ఈ మధ్యకాలంలో విడిపోవడానికి పెద్దగా సమయం తీసుకోవడం లేదు నేటితరం యువత. అయితే ఇలా విడిపోవడంలో భార్య భర్తకి నష్టం వాటిల్లుతుందో లేదో తెలియదు కానీ పిల్లలు మాత్రం చాలా నష్టపోతారు. తల్లి దగ్గర పెరగాలో, తండ్రి దగ్గర పెరగాలో అన్న అయోమయ స్థితిలో ఉంటారు. ఎవరో ఒకళ్ళ దగ్గర పెరిగిన మరొకరి ప్రేమ, అనురాగం పిల్లలకు లభించవు. ఫలితంగా  ఆ ప్రభావం అనేది పిల్లల యొక్క మానసిక వ్యక్తిత్వం పై చాలా ప్రభావితం చూపుతుంది. ఇలా  పిల్లలు సింగిల్ పేరెంట్ వద్దే పెరగాల్సిన పరిస్థితి వస్తే  పిల్లలు చాలా బాధ పడతారు. తల్లి లేదా తండ్రి.. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే పిల్లలకు ప్రేమను అందిస్తున్నారు.పిల్లలకు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ చాలా అవసరము.

 

 


చిన్నపిల్లలు  తెలిసి తెలియని వయసు వాళ్ళది. అలాగే తప్పు ఒప్పుల గూర్చి కూడా వాళ్ళకి ఏమి తెలియదు. తల్లితండ్రులు ఎందుకు విడిపోతున్నారో అన్న  విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే అమ్మ ప్రేమ, నాన్న అనురాగం. పిలల్లకు తల్లి తండ్రి ఇద్దరు కావాలి. ఇద్దరి ప్రేమ వాళ్ళకి కావాలి. చుడండి ఎప్పుడన్నా మన ఇంట్లో అమ్మ నాన్న తిట్టుకున్నా లేక కొట్టుకున్న పిల్లలు భయంతో వణికిపోయి వెక్కివెక్కి ఏడుస్తూ ఉంటారు.పాపం దేవుడికి దండం పెట్టుకుంటారు  దేవుడా మా అమ్మ నాన్నల మధ్య గొడవ తగ్గిపోవాలని..!

 

 


 అమ్మ నాన్న ఇద్దరు ఉన్నపుడే పిల్లలకి సంతోషం. తెలిసో తెలియక తప్పు అనేది అందరం చేస్తాము. కాని ఆ తప్పు సరిదిద్దుకున్నపుడే మనకి సమాజంలో ఒక విలువ అనేది ఉంటుంది. చీటికీ మాటికీ చిన్న చిన్న గొడవలతో విడాకుల దాక వెళ్ళకండి. పిల్లల మనసుని గాయం చేయకండి. పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరు కావాలి. అలాగే తల్లితండ్రులకు పిల్లలు కూడా కావాలి. పిల్లల యొక్క భవిషత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దృష్టిలో మంచి తల్లితండ్రులుగా ఉండాలని కోరుకుందాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: