కొందరు పిల్లలు చిప్స్​​, బిస్కెట్లు లాంటివి తింటుంటారు. దాని వల్ల బరువు పెరుగుతారు. వీలైనంత వరకు చిరుతిళ్లకు దూరంగా ఉండేలా పేరెంట్స్​ జాగ్రత్తలు తీసుకోవాలి. మరికొంతమంది పిల్లలు స్వీట్స్​, చాక్లెట్స్​ తినడానికి ఇష్టం చూపుతారు. అదేపనిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో కొవ్వుశాతం పెరిగి బరువుకు దారితీస్తుంది. గుడ్డు, మొలకలు, చిరుధాన్యాలను ఇవ్వాలి. ఇంకొంతమంది పిల్లలు ఒకే రకమైన ఫుడ్​ ఎక్కువగా తీసుకుంటారు. అలాంటివి కొంచెం తగ్గించాలి.

 


పిల్లల్లో శారీరక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లల పెరుగుదల కోసం కూడా సరైన ఫుడ్​ ఇవ్వాలి. లేదంటే ఎదుగుదల అంతగా ఉండదు. చాలామంది పిల్లలకు సరైన ఆహారం అందక ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. కాబట్టి డాక్టర్లను సంప్రదించి, పెరుగుదల కోసం ఏయే ఆహారం ఇవ్వాలో తెలుసుకోవాలి.పిల్లలు చదువులో ముందుండాలనే ఆలోచనతో పిల్లల్ని ఆటలకు దూరంగా ఉంచుతారు ఎక్కువమంది పేరెంట్స్. చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమే. ర్యాంకుల ధ్యాసలో పడి చాలా స్కూళ్లు పిల్లలకు ఆటలు ఆడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. దీంతో వ్యాయామం లేక చురుకుదనం తగ్గుతుంది. కాబట్టి పిల్లలకు ఇష్టమైన ఆటలు ఆడేలా ఎంకరేజ్​ చేయాలి. రన్నింగ్​, జాగింగ్​ లాంటివి అలవాటు చేయాలి. దాని వల్ల మానసిక ప్రశాంతతతోపాటు యాక్టివ్​గానూ ఉంటారు.చాలామంది పిల్లల స్కూల్​ బ్యాగ్స్​లో​ చాక్లెట్లు, చిప్స్​ ప్యాకెట్లే ఎక్కువగా ఉంటున్నాయి. లంచ్​ టైమ్​లో పిల్లలు అన్నం తినకుండా ఫాస్ట్​ఫుడ్​ తినడానికి ఇష్టం చూపుతున్నారు. 

 


ఇరవై నుంచి యాభై రూపాయల వరకు పాకెట్​ మనీ మెయింటెయిన్​ చేస్తున్నారు. ఆ డబ్బులతో కూడా చిప్స్​ ప్యాకెట్లు కొంటున్నారు. చాలామంది పేరెంట్స్​ ఒకే రకమైన లంచ్ ​బాక్స్ ​ను ప్రిపేర్​ చేస్తున్నారు. కొందరు ఇడ్లీ, మరికొందరు దోసెలు పెడుతున్నారు. చాలామంది పేరెంట్స్​ ఉద్యోగాలు చేస్తుండటంతో పిల్లల డైట్​పై ఫోకస్​ చేయలేకపోతున్నారు. దానికితోడు గారాబం కూడా చేస్తుంటారు. ఇవన్నీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. చాలామంది పిల్లలు మ్యాగీ, నూడిల్స్, సమోసాలు, బర్గర్లు తినడానికి ఇష్టం చూపుతారు. దాని వల్ల ఆకలి తీరుతుంది కానీ.. సరైన పోషకాలు అందవు.  బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి వీలైనంత వరకు పేరెంట్స్​ ఇంట్లో తయారు చేసినవే ఇవ్వడానికి ప్రయత్నిచాలి. అప్పుడే పిల్లలు బలంగా తయారవుతారు. ‌‌‌‌‌‌‌‌‌‌

మరింత సమాచారం తెలుసుకోండి: