పిల్లల పెంపకం అన్నది తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల పెంపకం విధానాలను బట్టి పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పిల్లలను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులది.అలా అని పిల్లలు తప్పు చేస్తే కఠినంగా శిక్షించకూడదు. ప్రేమ, ఆప్యాయతలతో దగ్గరకు తీసుకుని వారు చేసింది తప్పు అని వాళ్ళ మనసులో మార్పు తీసుకురావాలి. చిన్నప్పటి  తల్లిదండ్రులు పెంపక విధానాలపై వారి నూరేళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. తప్పు చేస్తే అది తప్పు అని చిన్నతనం నుంచే చెప్పాలి అంతేగాని చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు అని గారాబం చేయకూడదు. ఇప్పుడు లైఫ్ స్టైల్ మొత్తం మొబైల్ లో గడపడం ఎక్కువ అయిపోయింది.

 

 

 

ఉద్యోగాల వల్ల పిల్లల్తో ఆడే పాడే సమయం తక్కువ  అయిపోయింది. తల్లిదండ్రుల పెంపకం విషయంలో లోపం ఉన్నట్లయితే వాటి పర్యవసానాలు, దుష్పరిమాణాలు పిల్లలు అనుభవించాలిసి వస్తుంది.    పిల్లలను స్నేహ భావంతో పెంచితే ఇతరులు మీద ప్రేమ భావన పెంచుకుంటారు.  తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నప్పుడు కొట్టుకోవడం, అరుసుకోవడం చేయకూడదు. పిల్లలకు చిన్న వయసులోనే మంచిచెడుల పై అవగాహన కలిగించాలి. తల్లిదండ్రులు  పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చేసే ప్రతి పని వారి తల్లితండ్రులను చూసి అనుకరిస్తారు. కనుక తల్లితండ్రులు మంచి నడవడిక, ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు తప్పకుండా మంచి విలువలని నేర్చుకుంటారు. పిల్లల విషయములో లైగింక బేధం చూపించకూడదు ఆడ, మగ ఇద్దరిని సమానంగా చూడాలి.పిల్లాడికి అన్ని కొనిచ్చి, మంచి చదువు చదివిస్తారు. 

 

 

 

కానీ ఆడపిల్ల విషయానికి వస్తే కొంతమంది తల్లితండ్రులు వివక్ష చూపిస్తారు.ఆడపిల్లకు ఎందుకు అని అంటారు. అలా చేయకూడదు. తల్లితండ్రులకి పిల్లలు ఇద్దరు సమానమే అన్న విషయాన్నీ గుర్తుచుకోండి .
పిల్లలతో ఎక్కువ సేపు గడపండి. కలిసి భోజనం చేయండి. పిల్లలకి మొబైల్ ఫోన్స్ అలవాటు చేయకండి. దాని వల్ల విజ్ఞానం ఎంత వస్తుందో తెలియదు కాని, పిల్లలకు చిన్న వయసులోనే తలనొప్పి, కంటిచూపు మందగించడం, ఊబకాయం, అలసట, హింసాత్మాక ప్రవర్తన, మొండిగా ఉండడం, అభద్రతాభావం వంటివి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: