చిన్నపిల్లలకు  మొదట అన్ని నేర్చుకునేది ఇంట్లోనే. అలాగే తొలి గురువులు తల్లిదండ్రులే. ఇంటి వాతావరణం మరియు ఇంట్లోని వ్యక్తుల వైఖరులే మీ పిల్లలను బాగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు వారి సున్నితమైన మనసులలో మంచి భావాలను నింపే పని చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ఉంటాడు. కొందరు ఎప్పుడూ కొంటెగా ఉంటారు. కొందరు పిల్లలు కొంచెం ఆట పట్టిస్తారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను, బామ్మలను చాలా బాధపెడతారు.వాళ్ళకి ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడి భాద పెడతారు.అందుకనే పిల్లలను గారాభం చేయకండి. అతి గారాభం చాలా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది. 

 

 

అలాగే ఇంట్లోని వస్తువులను నాశనం చేయడం, ఎక్కువగా అరుస్తూ ఉండటం, ప్రతిసారీ గుమ్మం దాటి బయటకు వెళ్లడం వంటివి చేసినప్పుడు మీరు కోపం తెచ్చుకోకండి. అలాగే పిల్లలను కొడితే లేదా తిడితే వారికి జ్ఞానం వస్తుందనే భావనలో ఉంటే ముందు దాన్ని వదిలేయండి.నేటి తరం తల్లిదండ్రులు పిల్లలకు గ్యాడ్జెట్స్ ఇవ్వడం సాధారణమైంది. ఇక కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి వ్యసనాలను ప్రోత్సహిస్తున్నారు. అందుకే మీరు పిల్లల వద్ద ఉన్నప్పుడు మీరు గ్యాడ్జెట్ వ్యసనాన్ని పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసం ఇలా చేయండి.
పిల్లల ముందు మీ మొబైల్ వాడకాన్ని తగ్గించండి
మీ పిల్లలను బయటకు వెళ్లి ఆటలు ఆడటానికి ప్రోత్సహించండి.

 

 

 

ఆటలు ఆడడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా దృడంగా ఉంటారు. అలాగే చిన్న పిల్లలకు, గాడ్జెట్‌ను పరిమిత సమయం వరకే ఉపయోగించాలనే నిబంధనను తీసుకురండి.పిల్లలు పెరిగేకొద్దీ వారికి స్వేచ్ఛను ఇవ్వండి. కొంతమంది పెరిగేకొద్ది పెద్దల మాట వినరు. ఇంతమాత్రాన మీరు వారిపై కోపం తెచ్చుకోవద్దు. మీ పిల్లల అభిప్రాయానికి విలువ ఇస్తున్నట్లు వారికి తెలియజేయండి. మీ మాటలను వినేలాగా, మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు మీ బిడ్డను ప్రోత్సహించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: