ఇప్పటి తల్లులందరూ పిల్లలకు ఎక్కువగా  డైపర్లను వాడుతున్నారు. ఒకప్పుడు అయితే పిల్లలకు ఇంట్లోనే కాటన్‌తో తయారుచేసిన క్లాత్స్ ని  వాడేవారు. కానీ ఆ గుడ్డల వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తాయనుకున్న తల్లులు వాటిని మానేసి మార్కెట్‌లో దొరికే డైపర్లను వాడుతున్నారు. వీటి వాడకంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. వీటి వాడకంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. 

 

 

 

చౌకరకానికి చెందిన డైపర్లు త్వరగా నానిపోయి పిల్లలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వీటి వల్ల పిల్లలకు ఎలర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డైపర్ తడిసి పిల్లాడు ఇబ్బందిపడుతున్నాడు అని తెలిసిన వెంటనే మార్చేయాలి. లేకపోతే పిల్లలకు ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు చౌకరకం డైపర్లు కాక నాణ్యమైనవి ఎంచుకోవాలి. ఇవైతే తొందరగా నానిపోకుండా ఉంటాయి. అంతేకాక వీటిపై పేర్కొన్న సామర్థ్యాన్ని బట్టి ఆ సమయంలోగా వాటిని మారుస్తూ ఉండాలి.  డైపర్ల వల్ల ఇన్‌ఫెక్షన్స్ రావు. వాటిని సరిగా వాడకపోవడం వల్ల, నాసిరకానివి వాడి పిల్లలను అలాగే తడిగా ఉంచడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. కొంతమంది ఇప్పటికీ డైపర్ల బదులు పిల్లలకు మెత్తని కాటన్ క్లాత్‌లనే ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా మంచివి. కానీ తడిసిన ప్రతీసారి వీటిని మారుస్తుండాలి.  పిల్లలకు తడి తగలకుండా, పొడిగా ఉండేలా చూసుకోవాలి.పిల్లలకు డైపర్ తొడిగే ప్రతీసారి అక్కడ పౌడర్ అద్దుతూ ఉంటారు. డైపర్లు తడిచిన వెంటనే తీసేయాలి. అలాగే ఉంచడం  మంచి పద్ధతి కాదు. దీనివల్ల పిల్లలకు శ్వాసకోస ఇబ్బందులు ఎదురవుతాయి.

 

 

 

ఒకవేళ  ఏదన్నా ఊరు వెళ్లవలిసిన పరిస్థితి వస్తే  తడిచిన డైపర్ తీసేసి ఆ ప్రదేశాన్ని నీళ్ళతో కడిగి, పొడిగా తుడిచి నాణ్యమైన డైపర్ కానీ లేదా మెత్తని వస్త్రంతో చేసిన లంగోటీలు కానీ వాడటం వల్ల పిల్లలకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు కానీ రాషెస్ కానీ రావు. కృత్రిమ ఉత్పత్తులు మీ శిశువు చర్మంను చికాకుపరచవచ్చ.అలాగే డైపర్లు వాడి పిల్లలకు ఏవిధమైన దద్దుర్లు వచ్చిన గాని ఇలా చేయండి. వెనిగర్  డైపర్ రాషెస్ ను నివారించే ఒక ఉత్తమ హోం రెమెడీ. ఒక కప్పు వాటర్ లో ఒక టీస్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి, డైపర్ మార్చిన ప్రతి సారి ఈ మిశ్రమంతో బేబీ బాటమ్ ప్లేస్ ను శుభ్రంగా తుడిస్తే రాషెస్ తగ్గుతాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: