సృష్టికి మూలం అమ్మ.ఆమె లేనిచో ఈ ప్రపంచమే లేదు. నవమాసాలు మోసి పురిటినొప్పులు అనుభవించి, పేగు తెంచి మనకు జన్మ ఇస్తుంది. ఈ ప్రపంచంలో కల్మషంలేని ప్రేమ ఏదంటే అది అమ్మ ప్రేమ మాత్రమే. మనం కడుపులో ఉన్నపుడు  కాళ్లతో తంతున్నా..పంటి బిగువన నొప్పి భరిస్తూ కని పెంచే బంధమే అమ్మ..కన్న తర్వాత కూడా కడుపులో పెట్టుకుని చూసుకునే గొప్ప దైవం అమ్మ.
పుట్టే బిడ్డ ఏలా ఉన్న గాని మనల్ని మనలా ప్రేమించేది మన అమ్మ మాత్రమే.  మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణంఏదైనా ఉందంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే. బిడ్డ పుట్టాక  బిడ్డ యొక్క రంగు, రూపు, ఆడ , మగ అనే తేడా అమ్మకి ఉండదు.

 

 

 

ఎందుకంటే అమ్మకి తన బిడ్డ ఎలా ఉన్న గాని ఇష్టమే. ఈ ప్రపంచంలో అమ్మకి తన బిడ్డ కన్న అందమైన మనిషి ఎవరు లేరు అనుకుంటుంది. అమ్మ కళ్ళకి తన బిడ్డే గొప్ప అందగాడు.ఒక్క  మనుషులకు  మాత్రమే కాదు ఈ ప్రపంచంలో  ప్రతి ఒక్క జీవికి అమ్మ ఉంటుంది.  అంత ఎందుకు ఈ సకల భూప్రపంచంలో ప్రతి జీవచల రాశికి అమ్మ ఉంటుంది. అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే..మన ఆనందంలోనే తనను చూసుకునే ఏకైక వ్యక్తి అమ్మ నీవు ఓడిపోతే నీ వెన్నంటే ఉండి నీకు ధైర్యం చెబుతూ నిన్ను విజయం వైపు నడిపించేది అమ్మ.అంతేకాదు మనకు చిన్న ఆపదొచ్చిన మన కన్నా ఎక్కువ బాధపడేది అమ్మ. నీ కంటూ వేరే ప్రపంచం ఉండొచ్చు కానీ అమ్మకు నీవే ప్రపంచం అని గుర్తుంచుకో.

 

 

 

బిడ్డ గూర్చి ధ్యాస తప్ప వేరే ఏమి ఉండదు ప్రతి తల్లికి. ఏ అమ్మ అయినా తన బిడ్డను ఎందుకు చదివిస్తుందంటే తన ఆకలి బాధ తీరుస్తాడని మాత్రం కాదు. తన బిడ్డ ఒక ముద్ద కోసం ఎవ్వరి ముందు చేయి చాపకుండా గర్వంగా బతకాలని. జీవితాంతం నీ తల్లిని భుజాలపై మోసి సేవ చేసినా ఆ తల్లి ప్రసవ వేదన రోజు అనుభవించిన బాధలో  కనీసం రవ్వంత రుణాన్ని కూడా నీవు తీర్చలేవు మిత్రమా.. అమ్మ ఉన్నంత కాలం అమ్మని పట్టించుకోము.. అమ్మ లేనంత కాలం అమ్మ లేదని బాధపడతాం ఇదే కదా విచిత్రం అంటే.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: