చిన్నపిల్లలకు అసలు ఎలాంటి ఆహారం పెడుతున్నాం అనే విషయం ప్రతి తల్లి తండ్రి ఒకసారి ఆలోచించండి. పిల్లలకు పండ్లు పెట్టడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పండ్లు,  కూరగాయలు మొదలైనవి కృత్రిమ పద్ధతిలో పెంచినవి అలాగే రసాయన పద్దతిలో  పండించినవె  మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంటాయి వీటిని తినడం ద్వారా ఆరోగ్యానికి హాని చేసే ఎన్నో రకాల రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. వీలైనంతవరకు సహజసిద్ధంగా అంటే  ఇంటి ఆవరణలో పండించిన కూరగాయలు,  పండ్లు పిల్లలకు  ఇవ్వటానికి ప్రయత్నించండి.

 

 

 

పిలల్లకు ఎక్కువగా  పోషకాలు అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలు,  గింజలు డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిని  రోజు వారి ఆహారంలో భాగం చేయండి. అంతేకాదు సీజనల్ పండ్లు పిల్లలకు అందించండి. పిల్లలు క్రమంతప్పకుండా  రోజుకి కనీసం ఒక్క పండు అయిన  తినేలా చూసుకోండి. వీటి ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తో పాటు పిల్లలు చిన్న తనం నుంచే అన్ని రకాల ఆహారాలను తినడానికి అలవాటు పడతారు.అలాగే  పిల్లలు ఎక్కువగా ఇష్టపడే చాక్లెట్స్, కేక్స్, చిప్స్  మొదలైన వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా ఇవి శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి వీటికి బదులు ఆరోగ్యానికి మేలు చేసేవి  మీరే ఇంట్లో తయారు చేసి వారికి తినిపించండి. 

 

 

 

 

సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులను ఎక్కువగా గమనిస్తూ వాళ్ళు చేసే పనులను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు అదే విధంగా ఆహారం విషయంలో కూడా తల్లిదండ్రులు తినే ఆహార పదార్థాలు తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ మీకు ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల కూరగాయలు,  పండ్లు తినే అలవాటు ఉంటే పరవాలేదు.అంతేగాని నేను ఆ పండు తినను, ఆ కూర తినను అంటే పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. అందుకే  అలవాటు లేనివాళ్లు పిల్లల కోసం వాటిని అలవాటు చేసుకోండి. మిమ్మల్ని చూసి వాళ్ళు వాటిని తినడం అలవాటు చేసుకుంటారు. అంతేకాని బలవంతంగా వాటిని తినిపించడానికి  ప్రయత్నిస్తే  అది కాస్త అసహ్యం లాగా పెరిగి జీవితంలో ఇంకా వాటి జోలికి వెళ్లకుండా తయారయ్యే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: