ఒకప్పుడు పిల్లలు ఎంచక్కా స్కూల్ నుంచి రావడం, కొంచెం సేపు టీవీ చూడడం, ఎంచక్కా బయట పిల్లలతో ఆడుకోవడం లాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు అస్తమానం ఫోన్ కు లేదంటే కంప్యూటర్ కి అతుక్కుని పోతున్నారు.ఇప్పుడు కరోనా వైరస్ వల్ల స్కూల్స్ లేవు. బయటికి వెళ్లి ఆడుకునే పరిస్థితి లేకపోవడంతో స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, టీవీ వంటి డిజిటల్‌ పరికరాలపై ఎక్కువ సమయాన్ని గడుపడం ప్రారంభించారు.తల్లితండ్రులు కూడా వల్ల అల్లరి భరించలేక పిల్లలు అడిగింది ఇచ్చేస్తున్నారు. దానికి తగ్గట్టు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైన తర్వాత పిల్లలు  రెండు మూడు గంటలు ఫోన్‌/ట్యాబ్‌/ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌ చూడడం ఎక్కువ అయింది.

 

 

 

 పాఠశాలలు ఇప్పట్లో తెరిచే అవకాశం లేకపోవడంతో క్లాసుల సంఖ్య పెరిగింది. డిజిటల్‌ స్క్రీన్‌ను చూడటం నాలుగు గంటలు దాటినప్పటి నుంచే పిల్లల్లో కంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. కంప్యూటర్‌ స్క్రీన్‌ లేదా డిజిటల్‌ పరికరాల స్క్రీన్‌నుంచి వెలువడే బ్లూలైట్‌ కంటిపొరను దెబ్బతీయగలదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్లను తదేకంగా చూడటం వల్ల వచ్చే సమస్యలను సైన్స్‌ పరిభాషలో 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ అంటారు. . దీనిని నిర్లక్ష్యం చేస్తే పిల్లల్లో శారీరక, మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఎలా చిన్నపిల్లలు డిజిటల్ స్క్రీన్  ఎక్కువ సేపు చూడడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుంది. కండ్లు పొడిబారడం, మంటలు, నొప్పి రావడం, ఎర్రబడటం, కండ్ల నుంచి నీళ్లు కారడం, అలసిపోయి కండ్లు మూతపడిపోవడం, కండ్ల కింద నల్లటిచారలు రావటం, చూపు మందగించడం, తలనొప్పి లాంటి  ఇబ్బందులు వస్తాయి.

 

 

 

అందుకని పిల్లలు ఈ  జాగ్రత్తలు పాటించాలి 
పదే పదే కనురెప్పలు ఆడించాలి.స్క్రీన్‌ను తదేకంగా చూడకుండా అప్పుడప్పుడూ ఒకటి రెండు క్షణాలపాటు పక్కకు తిరిగి చూడాలి.ప్రతి 20 నమిషాలకు ఒకసారి బ్రేక్‌ తీసుకోవాలి. ఆ సమయంలో దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. కాసేపు కండ్లకు విశ్రాంతి ఇవ్వాలి.
కండ్ల్లపై ఒత్తిడిని తగ్గించడానికి స్క్రీన్‌ లైటింగ్‌, గదిలో కాంతి సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.సరైన కుర్చీని ఎంపిక చేసుకొని, నిటారుగా కూర్చోవాలి.స్క్రీన్‌పై అక్షరాల సైజ్‌ను పెంచుకోవడం వంటివి చేయాలి.చిన్న అక్షరాలు అయితే చదవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆహారం పరంగా.. విటమిన్‌ ఏ, విటమిన్‌ సీతో కూడిన ఆహార పదార్థాలు, బొప్పాయి, క్యారెట్‌, బ్రాకోలి, తోటకూర, గుడ్లు వంటివి తీసుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: