తల్లితండ్రులు పిల్లల్ని కనీసం సంవత్సరానికి ఒకసారి అయిన  హాలిడే ట్రిప్ లాంటివి ప్లాన్ చేసుకుని పిల్లలతో ప్రయాణం చేయించాలి.అలాగే వారికి రైలు బస్ జట్కా రిక్షా వంటి ప్రయాణాలు చాలా ఆనందానిస్తాయి. ఇప్పటి కాలానుగుణంగా పిల్లలు చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం విదేశాలు కూడా వెళ్లాలసిన పరిస్థితి  ఏర్పడుతోంది. చదువుకి  సంబంధిత విజ్లానమెంతున్నా బాహ్య ప్రపంచంలో ఏ పనయినా గాని వారంతట వారే చక్కపెట్టుకునే స్వామర్ధ్యం వారికి రావాలంటే పెద్దవారు పిల్లల్ని  తమతో తిప్పుతూ అవసరమయిన పరిజ్ఞానం కలిగేలా అన్నీ నేర్పుకోవాలి.

 

 

 

పదేళ్లు దాటిన పిల్లలకి టికెట్ రిజర్వ్ ఎలా చేసుకోవాలో చెప్తూ  స్టేషన్ లో ఉన్న ఎంక్వయిరీ, ఫ్లాట్ ఫామ్ ,లను చూపించి రైల్వే ఎనౌన్స్ మెంట్ విని మన ట్రైన్ నెంబర్  చెప్పి అది ఏ ఫ్లాట్ ఫామ్ మీదికొస్తోందో అక్కడికి ఎలా వెళ్లాలో సోదాహరణంగా వివరించాలి.బస్ అయిన  ట్రైన్ అయినా  సరే సాధ్యమైనంత వరకు పగటిపూట ప్రయాణాలు చేయిస్తూ మన ప్రకృతి అందాలు కొండలు లోయలు నదులు రోడ్స్ లాంటివన్నీ చూపిస్తూ వారేది అడిగినా ఓపికగా చెప్పాలి.తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ప్రయాణం చేయడం నేర్పాలి.ఏది అమ్మకానికొస్తే  అది కొనుక్కుని  తినకుండా అవసరమైనవే కొనుక్కోమని వారి ఇష్టాయిష్టాలను గమనిస్తుండాలి.చారిత్రాత్మక ప్రదేశాలు ఇతిహాసాల కు సంబంధిత ప్రదేశాలకు తీసుకెడితే తప్పని సరిగా స్థల పురాణాలు గురించి తెలియచేసే గైడ్ ని బుక్ చేసుకుని అతను చెప్పే వివరాలు వినమనాలి.

 

 

బంధువుల  ఇళ్లకు మిత్రుల దగ్గరకు వెళ్లినపుడు కొత్తగా ముడుచుకు పోయి ఉండకుండా,అందరిలో కలిసేలా వారిని ప్రోత్సాహించాలి.పసిపిల్లలతో ప్రయాణాలు చేసేప్పుడు సమశీతోష్ణ స్ధితి ఉండేలా చూసుకోవాలి. తొక్కిసలాటలు లేకుండా సాఫీగా ఉన్న ప్రయాణాలకే పరిమితమవ్వాలి.ప్రయాణాల లో పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.బెర్తుల మీద పడుకోపెట్టినా తల్లో తండ్రో ఒకరు వారిపక్కనే ఉండాలి.ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచితులనుండి తినుబండారాలు ఏవీ తీసుకోకుండా పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. పిల్లల్ని ఎల్లపుడు వెంటపెట్టుకుని ఉండాలి.  ప్రయాణాల లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా  ముందే అన్నీ చెక్ చేసుకోవాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: