ఈ రోజుల్లో పిల్లల మీద మన ఆలోచనలు రుద్ది, వారిలోని అమాయకత్వాన్ని పోగొట్టి భౌతికవాదoతో, విజయం ఒక్కటే ముఖ్యం అని వారికి నూరి పోస్తున్నాం. పిల్లలు ఏమి అవ్వాలి అనుకుంటున్నారో అది అవ్వడానికి కావలసిన స్థలం మరియు స్వేచ్ఛ ఇవ్వకుండా వారిని పెంచుతున్నాం. ఇప్పటి పిల్లలు, యువతా చదువు ఒత్తిడి మరియు సామాజిక ఒత్తిడిని ఎదుర్కుని తట్టుకుని నిలబడలేకపోతున్నారు. ఈ ఒత్తిడి వలన వారి ఆరోగ్యం, ప్రశాంతత దెబ్బ  తింటున్నాయి.అందుకే తల్లితండ్రులు తమ పిల్లల్ని చిన్నప్పటి నుంచే రోజు యోగా చేయడానికి తమతో పాటు యోగా క్లాసులకు తీసుకువెలితే పిల్లలకు యోగ మీద ఆసక్తి కలుగుతుంది.అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే తల్లితండ్రులు మొదటగా, అసలు యోగా మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అర్ధం చేసుకోవాలి.

 

 

 

యోగాతో భంగిమలు, ఆటలే కాకుండా శరీరాన్ని అనువుగా మార్చుకోవడానికి, సంతులనం మరియు సమన్వయం చేసుకోవడానికి, ఒత్తిడి దూరం చేసుకుని దృష్టి నిలుపుకోవడానికి మరియు ముఖ్యంగా జీవితం సంపూర్ణంగా ఎలా జీవించాలో నేర్పిస్తుంది. పిల్లలు యోగా నేర్చుకుంటే వారు పొందే ప్రయోజనాలు అనంతం. పిల్లల వయసుతో కాని, శారీరిక లేదా మానసిక పరిస్థితి ఏదైనా సరే వారు యోగా నేర్చుకుని దాని ప్రయోజనాలు పొందవచ్చు.ఇంతకు ముందు కంటే, ఇప్పటి పిల్లలు ఎక్కువ ఒత్తిడి ఎదుర్కుంటున్నారు. అవసరానికి మించి పని మరియు ఎక్కువ సమాచారం దొరకడం, ఖాళి సమయం దొరకకపోవడం, వారికి ఒత్తిడిని తట్టుకునే సమయం మరియు సాధనాలు దొరకట్లేదు అని చెప్పవచ్చు.

 

 

 

ఆ విషయంలో యోగ సాధన సహాయం చేస్తుంది: పిల్లలు వారికి వారు ఎప్పుడైనా సరే ఒత్తిడికి గురి అయినప్పుడు లేదా తెలియని ఆరాటానికి లోనైనప్పుడు యోగా వారికి ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో నేర్పిస్తుంది. యోగా వారికి ఓర్పు, ఓపికనే కాకుండా ఒక విషయం మీద దృష్టి, ఏకాగ్రత నిలపడం నేర్పిస్తుంది.చాలా విషయాల్లో మనం అనుకున్న దానికంటే పిల్లలు ఎక్కువ గ్రహిస్తారు. యోగా క్లాసులలో, అక్కడ చెప్పే విషయాలు అన్ని వారి చిన్ని బుర్రల్లోకి ఎక్కించుకుంటారు లేదా వారి యోగా మాట్ మీద దాని చుట్టు పక్కల తిరుగుతూ ఉంటారు. యోగా ప్రశాంతత కలిగించేది మరియు ఏకాగ్రత పెట్టి నేర్చుకోవాల్సిన విద్య కాబట్టి తల్లితండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: