పిల్లల విషయంలో తల్లితండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఇది చెప్పాలన్న గాని విసుగు చెందకుండా చెప్పాలి. పిల్లలకు ఏ విషయం చెప్పదలచుకున్నా ఒక్కటి లేదా రెండుసార్లు మాత్రమే చెప్పండి. అలాగే పదేపదే న్యాగింగ్‌ చేస్తే పిల్లలు మిమ్మల్ని లెక్కచెయ్యరు. మీ పిల్లల్లోని లోపాలను ఎత్తిచూపడం కన్నా వారిలో ఉన్న స్కిల్స్‌ గుర్తించి అభినందించండి.పిల్లలు ఏది అడిగితే అది కొని ఇవ్వకండి. ఇవ్వకపోయినపుడు ఏడ్చితే బెదిరించండి తప్ప కొట్టవద్దు.పిల్లలు తప్పుచేసినపుడు ”మీ నాన్న రానీ చెప్తాను లేదా అమ్మ రానీ చెప్తాను నీ సంగతి అనకూడదు. దాని వలన వారికి ప్రేమ బదులు భయం ఏర్పడుతుంది.

 

 

 

మీరు ఒక తప్పుచేస్తూ, అది చేయకూడదని పిల్లలకు చెప్పి, నవ్వుల పాలు కాకూడదు.  చంపేస్తాను, చీల్చేస్తాను, నరికేస్తాను లాంటి పదాలను వాడకూడదు.  పిల్లలు ఎప్పుడు లేవాలో, ఎప్పుడు చదవాలో, ఎప్పుడు పడుకోవాలో నేర్పి అవి ఆచరించేలా ప్రోత్సాహం అందించండి. ఇతరుల పిల్లలతో ఎట్టి పరిస్థితులలోను మీవాళ్లని పోల్చకండి. ఇద్దరు పిల్లల్లో వయసు తేడా నాలుగేళ్ల కన్నా ఎక్కువ ఉంటే, పెద్దవారికి చిన్నవారిపై అసూయ పెరగవచ్చు లేదా అభద్రతా భావన పెరగవచ్చు. అది గమనించి వారికి తగిన ప్రాధాన్యతనివ్వండి.పిల్లల్ని శిక్షించాల్సి వచ్చినపుడు ఎట్టి పరిస్థితిలోను చీకటిగదిలో పెట్టడం కానీ, పోలీసు భయం కల్గించడం గానీ చేయకండి.

 

 

 

 

పిల్లలకు దయ్యాలు, భూతాల కథలు చెప్పి, వాటి గురించి అతిగా భయపెట్టకండి.వారానికొకసారి పిల్లల్తో సరదాగా ఒక సినిమా లేదా ఫంక్షన్‌కి తప్పనిసరిగా వెళ్లండి.  మీ పిల్లల్ని మీ స్నేహితులకు పరిచయం చేసినప్పుడు చాలా క్లవర్‌ చైల్డ్‌ అని చెప్పండి. అది వారికి ప్రేరణ కల్గిస్తుంది.  ఇంటిపనులు, వంటపనులు చేసేటపుడు వారి సహాయం తీసుకోండి. అవి వారు కూడా నేర్చుకుంటారు.ఈకాలంలో ఆప్యాయతనందించే చుట్టాలను కలుస్తూ ఉండండి. బంధుత్వాలను మీరే చులకన చేస్తే, మీ పిల్లలకు రేపు డబ్బు, హోదా తప్ప కష్టం వచ్చినపుడు వెనుక ఉండి   సపోర్టు అందించేవారు  ఎవరు ఉండరు.

మరింత సమాచారం తెలుసుకోండి: