కొంతమంది పిల్లలు ఎప్పుడు  ముభావంగా, డల్ గా ఉంటూ, తమ చుట్టూ ప్రక్కల జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా, పక్కవారితో సంబంధం లేకుండా  ఉంటుంటారు. తల్లితండ్రులు అది తప్పకుండా పట్టించుకోవలసిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని  ఎటెన్షన్ డిఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ అంటారు.ముందు చురుకుగా తెలివిగా ఉంటారు తర్వాత రాను రాను మందకొండిగా తయారవుతారు.ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమయిన మార్పు సంభావిస్తుందన్న మాట.

 

 

 

 

మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడే ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి అయిదేళ్ళలో అత్యధిక ఎదుగుదల రికార్డు చేస్తుంది. శరీరంలోని హార్మోన్లు, తినే ఆహారంలోని విటమిన్లు ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేనరిక వివాహలలో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే.అయితే పిల్లల్లో ఈ లోపాన్ని గుర్తుపట్టడం ఎలా అని ఆలోచిస్తున్నారా.. అయితే చుడండి.. క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా వుందో తెలుసుకుంటూ వుండాలి. పిల్లల స్నేహితులేవరు.. వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు? ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు.అలాగే 
ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లలచుట్టూ ఏర్పరచాలి.

 

 

 


క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి.
సంగీతం నేర్పడం, పెయింటింగ్ వేయడం, డ్యాన్స్ అంటే నృత్యం… మ్యూజిక్ అనుగుణంగా చిందులు వేయడం నేర్పితే వాళ్ళల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. అలాగే తల్లితండ్రులు పిల్లలతో స్నేహపూర్వంగా ఉంటూ వాళ్ళ ఇబ్బందులను తెలుసుకుంటూ ఉండాలి.అప్పుడప్పుడు బయటకు తీసుకుని వెళ్తూ ఉండాలి. వాళ్ళకి నచ్చింది మీరు చేయండి.పిల్లల్ని కూడా చేయనివ్వండి. అంతేగాని పెద్దల ఇష్టాన్ని పిల్లల మీద రుద్దడం వల్ల వాళ్ళు మానసికంగా కుంగిపోతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: