ముసి ముసి నవ్వులు నవ్వుతు,ముద్దులోలికించే పసి పిల్లలంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు.ఎన్నో బాధలు, కష్టాలు అనుభవిస్తే  మాతృత్వం లభిస్తుందో, అంతే ఆనందం ఆ చిట్టి పొట్టి పిల్లలు అడుగులు వేస్తుంటే కలుగుతుంది,అయితే వారి పట్ల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల ఎదుగుదల మీద కూడా జాగ్రత్త వహించాలి. సమాన్యంగా పిల్లలు సంవత్సర కాలంలో 3-5inch మాత్రమే పెరుగుతారు, అయితే వారివారి వయస్సు, చురుకుతనం, బరువుని దృష్టిలో ఉంచుకుని రోజుకి 1,000-1,400 క్యాలరీలు ఉండే ఆహారం ఇవ్వాలి. తప్పటడుగులు వేసే మీ చిన్నారులకు ఆహార నియమాలు గూర్చి తెలుసుకోండి.. 

 


మీ పిల్లలు తినేటప్పుడూ ఎక్కువగా అల్లరి చేస్తూ, ఒక్కొక్కటే తింటూన్నారా,అయితే ఆ ఒక్క వాటిలోనే అన్ని రకముల పోషక పదార్దాలు ఉండేలా చూసుకోవాలి,కొంచెం కొంచెం పెడుతూ తినిపిస్తూ ఉండాలి, అంతే కాకుండా వెన్న, బన్ను,వేరుసనగ వెన్న, ఇలా తినిపిస్తూ ఉంటే మంచిది.

 

అందమైన మీ చిన్నారులకి ద్రవం రూపంలోనే ఎక్కువ పొషకాలు పట్టించండి, అయితే ఎక్కడ “జ్యూస్” లను కాకుండా పాలు, నీరు, కొంచెం పండ్ల రసము కలిపిన నీరు కలిపి పట్టిస్తే ఎంతో మంచిది. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆడుతూ మనల్ని నవ్వించే మన పసిపిల్లలు ఆడీ ఆడీ, అలసిపోతారు.

 

అందుకే కొంచెం సమయం తరువాత కొద్ది కొద్దిగా చిరుతిండి తినిపిస్తే ఎంతో మంచిది, చిరుతిండి అనగానే మనం తినేవి కాకుండా, పొషక పదార్దాలతో కూడినవి, యాపిల్ సాస్, వెన్న,కేక్,క్యారెట్”లాంటివి పెట్టాలి. ఏమి తెలియని పసిపిల్లలకు రోజు ఒకే రకమైన ఆహారం పెట్టడం మంచిది కాదు. మీ పిల్లలకు అరటి పండు, యాపిల్ ని ముక్కలుగా చేసి తినిపించడం, లేదా వాటిలో పెరుగు కలిపి పట్టించడం మంచిది.

 

అధికంగా తినిపించే కన్నా పౌష్టికమైన ఆహారం కొంచెమైనా చాలు. వాళ్ళు తినడం లేదు అని ఎక్కువగా అలోచించి కంగారు పడనవసరం లేదు, మీరు చెయ్యవలసిందల్లా, వాళ్ళు తినే కొంచెం ఆహారంలో అయినా పొషక పదార్దాలు నిండుగా ఉండేలా చుసుకుంటే సరిపోతుంది, ప్రోటీన్లు, కాల్షియం, మినరల్స్, విటమిన్ C,పండ్లు, తృణధాన్యాలు, కొవ్వులు, సమృద్ధిగా ఉండే ఆహారాలు మీ పిల్లలకు ఇవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: