చిన్నపిల్లల విషయంలో తల్లితండ్రులను ఇబ్బంది పెట్టె ప్రధాన సమస్య రాత్రిపూట పక్క తడపడం. కొంతమంది పిల్లలు రాత్రి పూట నిద్రలో మూత్రవిసర్జన చేస్తారు.ఇలా చేయడం వల్ల పిలల్ని వేరే ఎక్కడికన్నా ఫంక్షన్స్ కి గాని లేక బంధువుల ఇంటికిగాని తీసుకుని వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే అలా నిద్రలో పక్క తడిపే పిల్లల కోసం తల్లితండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో చూద్దాం.

 

 

 


 పిల్లలు పుట్టింది మొదలు ఐదు, ఏడు, పది ఏళ్ల వరకూ  నిద్రలో పక్కతడుపుతు ఉండి ఆ తర్వాత   తీవ్రత తగ్గిపోతూ ఉంటే ఆ లక్షణాన్ని ప్రైమరీ బెడ్‌ వెట్టింగ్‌గా భావించాలి. ఇది అనారోగ్య లక్షణం కాదు. 99% పక్క తడిపే పిల్లలు ఈ కోవకు చెందినవారే!  కానీ కొందరు పిల్లల్లో 7, 10, 15 ఏళ్ల వయసుకు చేరుకున్నాగాని  రాత్రివేళ నిద్రలోనే మూత్రవిసర్జన జరుపుతారు .అలా ఐదు లేదా ఏడేళ్ల తర్వాత కొన్ని రోజులు లేదా కొన్ని ఏళ్లపాటు  బెడ్‌ వెట్టింగ్‌ జరుపుతూ ఉంటే, దాన్ని సెకండరీ బెడ్‌ వెట్టింగ్‌గా భావించాలి. దీనికి ఆరోగ్యపరమైన అంతర్లీన కారణాలు ఉండవచ్చు. వాటిని కనిపెట్టి చక్కదిద్దగలిగితే పరిస్థితి అదుపులోకి వస్తుంది.మొదటగా ప్రైమరీ బెడ్‌ వెట్టింగ్‌కు మందుల అవసరం లేకపోయినా, బిహేవియరల్‌ థెరపీతో సరిదిద్దవచ్చు.అది ఎలా అంటే  ప్రతి రాత్రి పడుకోబోయేముందు పిల్లల చేత మూత్రవిసర్జన చేయిస్తూ ఉండాలి.

 

 

 

 

అర్థ రాత్రి నిద్ర లేపి, దగ్గరుండి మూత్ర విసర్జన చేయించాలి.నిద్రకు ముందు ద్రవాహారాలు ఇవ్వకూడదు.చాక్లెట్లు, కారం, మసాలాలు, శీతల పానీయాలను నిద్రకు ముందు దూరంగా పెట్టాలి.కొందరు పిల్లలు మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయరు. కాబట్టి మూత్ర విసర్జన చేసే సమయంలో దగ్గరుండి, పూర్తిగా చేశాడో లేదో అడిగి నిర్ధారించుకోవాలి.వరుసగా 3, 4 రోజులపాటు పక్క తడపకపోతే పెద్ద బహుమతి ఇచ్చి ఆత్మవిశ్వాసం పెంచాలి.పక్క తడిపిన మరుసటి రోజు ఆ దుప్పట్లను పిల్లల చేత తీయించాలి. ఇలా చేస్తే బాధ్యతగా మసలుకుంటారు. మూత్రవిసర్జన మీద నియంత్రణ కూడా పెరుగుతుంది.నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: