అమ్మ అనే పదం...   ఆ తర్వాత ఆత్మీయతకు ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం ... ఆ పద ధ్వనే అలౌకికానంధాన్ని ఇస్తుంది. మండుటెండలో చలచల్లని ఐస్ క్రీం తింటున్న అనుభూతినిస్తుంది స్నేహం అనే భావనన చల్లని చలిలో వెచ్చని జ్ఞాపకాలను అదించే గతమే స్నేహం. నిర్వచనానికి అందని అతి సున్నితమైన ఫీలింగ్ స్నేహం.! మంచి స్పేహాన్ని సంపాదించుకోవటం అంత సులభం కాదు సంపాదించుకున్న స్నేహం జీవితాన్ని చేస్తే అంతా సుఖమయం చేస్తుంది. లేకుంటే సర్వనాశనం చేస్తుంది. ఒక వ్యక్తి శీలాన్ని, గుణగణాలను అతడు పెంచుకున్న స్నేహాన్ని బట్టీ నిర్ణయించగలం.. ఒకరితో స్నేహం కలుపుకుని చెలిమిని పెంచుకోవాలని నిర్ణయించుకుంటే వారి స్థితిగతులను, జీవిత సరళిని, మనోవైఖరిని, వారి అలవాట్లను, అభ్యాసాలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం. వారి నైజాని అర్ధం చేసుకుని వారి ఆలోచనలు, అనుభూతులు ఎలా ఉన్నది గమనించాలి. నిజమైన స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు సమయానికి తగినట్టుగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచకుంటారు. స్నేహంలో సుఖాలు పరస్పరం ప్రవృద్దిని పొందుతాయి. దు:ఖాలు విభాజ్యాలవుతాయి. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి శాంతిని కలిగిన దివ్య ఔషధం స్నేహం. అవసరమైనపుడు. సహకరించడానికి ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాలకు నివృత్తిని కలిగిస్తుంది.  సుఖ సంతోషాలకు దోహదంచేస్తుంది. ‘‘ మంచి స్నేహితుల చెలిమితో స్నేహాన్ని పెంపొందించుకోవాలంటే నీవు ఉత్తమ మత్రునిగా రూపొందిచుకోవాలి.’’ మనం అభిలషించే స్నేహితులు, కావాలని కోరుకునే మిత్రులు, వారికోసం మనం చేసే ప్రయత్తాన మీద, ఉద్యమాల మీద ఆధారపడి ఉంటారు. అసలైన మిత్రులు మన స్వబావాన్నిబట్టి, గుణాన్ని బట్టి ఏర్పడుతున్నారుగానీ మనం ఇచ్చేదాన్ని బట్టి ఏర్పడటం లేదు ఎక్కువ మంది స్నేహితులతో సౌభ్రతృత్వంతో సుఖమయంగా జీవించాలంటే .... ముఖ్యంగా గమనించాల్సినవి..... ఓర్పు, పట్టుదల, మంచి చెలిమితో స్నేహాన్ని బాగా పెంచుకోవాలంటే పట్టుదల ముఖ్యంగా ఉండాలి. పట్టుదలకు తగిన ఓర్పు కూడా అవసరం సహనబుద్ది లేకపోతే స్నేహం విడిపోతుంది. సౌహార్థత, విశాల హృదయం, స్నేహితుల ప్రవర్తన అన్ని వేళల్లోనూ ఒకే రకంగా ఉంటుందనుకోలే. మన చంచల బుద్దికే ఒక్కొక్కప్పుడు వారి ప్రవర్తన తప్పుగా అనిపించవచ్చు వారి పొరపాట్లను, లోపాలను పట్టించుకోకూడదు. మొండి వాదాలు పెంచుకోకూడదు. సత్యసంధత: ఇప్పటికైనా జయించేది సత్యమే, నిజమోప్పుడూ దాగదు అనేమాట మరిచిపోకూడదు. స్నేహితుల మధ్య ఇబ్బందులు, కలతలు, చికాకులు కలగకుండా ఉండాలంటే అబద్దాలు చెప్పకూడదు. స్నేహితుల్లో కనిపించే మంచిని ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. సహనభావం, ఎదుటివారిని గౌరవించడం ముఖ్యం, ఇతరలను బాధ కల్టించే చలోక్తులు మంచీవకువు, ఒక్కొక్కపుపడు ఇవి అపోహలకు దారితీస్తాయి.  ధైర్యొత్సాహాలు పరస్పర స్నేహంతో సాధించలేని విజయముండదు, స్నేహితుల నైపుణ్యానికి, శక్తిసామర్థ్యాలకు అసూపడకూడదు. స్నేహితుల గుణగణాలను పొగడడం ఉత్తమ స్నేహితుని లక్షణం. నిజమైన స్నేహితునికి భగవంతుడు ఇచ్చిన అపూర్వ కానుక నిష్కపటము, నిష్కలంకము అయిన ప్రేమ, ఏకొద్దిమందో దన్యులు సహజమైన స్నేహభావాలతో జన్మిస్తారు. విశాల హృదయంతో నిజాన్ని నిలబెట్టుకుంటూ ఆత్మ సంతృప్తి కోసం మంచిని చేస్తూ స్నేహాన్ని ప్రవృద్ది చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం తెరిచిన పుస్తకంలా ఉండాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: