విద్యలేని వాడు విద్యాధికుల చెంత,  నుండినంత పండితుండు కాడు,  కొలని హంసలకడ గొక్కెర యున్నట్లు,  విశ్వదాభిరామ వినుర వేమ  భావం  చదువు లేని వాడు పండితుల చుట్టూ తిరిగినంత మాత్రాన పండితుడు కాలేడు. హంసలున్న కొలనులో కొంగలు ఉన్నంత మాత్రానా కొంగలు హంసలు కాలేవు కదా. అందుకే, చదువు మీద మనసు లగ్నం చేయాలి తప్ప అదే పనిగా పండితుల వెంటబడి తిరగడం వల్ల ఏ ఫలితమూ ఉండదన్న సత్యాన్ని వేమన ఈ పద్యంలో చెబుతాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: