ఓ నది గట్టమీద ఓ చెట్టు వుండేది ఆ చెట్టు కొమ్మమీద ఓ పావురం కూర్చొనుంది. అతి నీళ్లల్లో ఓ చీమ కొట్టుకుపోతుండటం చూసింది. పాపం, ఆ చీమ నీళ్లల్లోంచి గట్టుమీదికి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ నీటి ప్రవాహం ముందు దానిప్రయత్నాలన్నీ  విఫలంమయ్యాయి. ఇంకో కొన్ని క్షణాల్లో చీమనీటిలో జాలికలిగింది. అప్పుడు ఆ పావురం ముక్కుతో చెట్టునుంచి ఓ ఆకును విరిచి చీమదగ్గర పడవేసింది. చీమ ఆ ఆకుపైకి వచ్చింది. ఆ ఆకు మెలమెల్లగా కొట్టుకుంటూ గట్టుదగరకువచ్చింది. గట్టుమీదికి వచ్చిన తర్వాత చీమ తనకు మేలు చేసిన పావురానికి కృతజ్ఞత తెలిపింది.  అప్పుడే ఓ పిట్టలు పట్టేవాడు అక్కడికి వచ్చాడు. చెట్టుకింద దాక్కున్నాడు పావురం వాణ్ణి చూడలేదు .వాడు వలకట్టిన వెదురుకర్రను మెలమెల్లగా పావురం కూచున్న చోటుకు పొనివ్వసాగాడు. ఈ దృశ్యం చూసిన చీమ గబగబా చెట్టుదగ్గరకు పోయింది. పాపం ! దానిక మాట్లాడ్డం చేతకాదు. లేకపోతే అది పావురాన్ని కాపాడలని చీమ నిశ్చయించుకొంది. అది చెట్టుకింద కూర్చున్న పిట్టలు పట్టేవాని కాలుమీదికి ఎక్కి తొడవరకు పాకింది. వానితోడను గట్టిగా కుట్టింది. చీమ కుట్టుడంతో పిట్టలు పట్టేవాడు ‘ అబ్బా’ అని కదిలాడు. వాడి చేతిలోవున్న వెదురుకర్ర పక్కకు కదిలింది. చెట్టు మీద ఆకులు గలగల మన్నాయి. ఆ చప్పడుకి పావురం రివ్వున పైకి ఎగిరిపోయింది. కష్టాల్లో ఉన్నవాళ్లకు మనం సాయం చేయ్యాలి. అప్పుడు మనకు కూడా కష్టాలు వచ్చినపుడు దేవుడు ఏవిధంగానో తోడ్పడతాడు. నీతి : ఇరుగుపొరుగుకు సాయం చేస్తే దేవుడు కరణిస్తాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: