సుబ్బయ్య కొడుకు సోమ జబ్బుపడ్డాడు. మల మలమాడే ఎండలో మామిడికాయలు కోసుకొందామని ఇంటినుంచి జారుకున్నాడు. ఎండవడతగిలి జ్వరం వచ్చింది. వొళ్లంతా సలసల కాగుతుంది. సుబ్బయ్య వైద్యునికి కబురు పెట్టాడు. వైద్యుడు సోము నాడిపట్టుకు చూశాడు. ‘‘ మీ అబ్బాయికి ఎండవడసోకింది. మీ కుర్రాడు అల్లరివాడుగా కనపడుతున్నాడు. అసలు మలమలమాడే ఎండలో బయటకి ఎందుకెళ్లాడు ? ఇదేం బాగలేదు. పెద్దలమాటలు వినకపోతే, పిల్లలకి ఇలానే శాస్తి జరుగుతుంది. కావాల్సిందే’’ అని చివాట్లు పెట్టాడు. అంతటితో ఆగితేనా ? దండకం చదువుతూ పొయ్యాడు.  సుబ్బయ్యకు ఇది నచ్చలేదు ఆయన వైద్యునికి ఓ నమస్కారం పెట్టి ‘‘ అయ్యా, మిమ్మల్ని పిలిపించి ఓ పెద్ద పొరపాటు చేశాను. ఇదిగో చెంపలేసుకొంటున్నాను. ఇదిగో మీ ఫీజు తీసుకొండి. ఇంక మీరు దయచేయండి. నేను మా అబ్బాయికి చికిత్స చేసేందుకు డాక్టర్ ను పిలిపిస్తాను. జ్వరం వచ్చిన వాడిని మీరు తిట్టిపోస్తూ, వాడికి మరింత బాధ కలిగిస్తున్నారే కాని వాడి అవస్థ చూసి జాలిపడటం లేదు ’’ అని చెప్పాడు. వైద్యుడు సిగ్గుతో తలొంచుకొని వెళ్లిపోయాడు. కష్టాల్లో వున్నపుడు, వాళ్ల తప్పలు ఎత్తిచూపి, సలహాలిచ్చి, వాళ్లను మరింత కష్ఠపెట్టకూడదు. కష్టాల్లో ఉన్నవాళ్లపట్ల సానుభూతి చూపి, వాళ్లను ఆదుకోవటమే మానవధర్మం.  నీతి : సానుభూతి కొండంత ఊరట.  

మరింత సమాచారం తెలుసుకోండి: