ఓ ఊరి దగ్గరి పొలంలో సారపక్షులు జంట నివసిస్తూ వుండేవి. ఆడ సారసపక్షి గుడ్లు పెట్టింది. కొంత కాలానికి గుడ్లలోనుంచి పిల్లలు బయటికి వచ్చాయి. వాటికి రెక్కలు వచ్చి అవి ఎగరటానికి ముందే పంటకోతకు వచ్చింది. సార పక్షులకు దిగులు చుట్టుకొనింది. రైతు పంటను కోయటానికి ముందే పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటుకి ఎగిరివెళ్ళాలి, కాని పిల్లలు ఎగరలేవే..! అప్పుడు సారపక్షి పిల్లలతో ఇలా అంది. ‘ మేం లేనప్పుడు ఎవరైన పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.,  ఓ రోజు సారపక్షి మేత తీసుకుని సాయంకాలం గూడు చేరుకొంది. అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి. ఈ రోజు రైతు వచ్చాడు. పొలం చుట్టూ తిరిగాడు. ఒకటి, రెండు చోట్ల నిలబడి పొలం వైపు చాలాసేపు చూసాడు, చేను కోతకు వచ్చింది ఇక కొయ్యాల్సిందే. ఈ రోజే వెళ్లి వూళ్లోని వాళ్లతో నా చేను కోయమని చెప్తాను. మీరేమీ భయపడకండి, రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్నిరోజులు మనం ఇక్కడే హయిగా ఉండొచ్చు. అని పక్షి పిల్లలతో చెప్పింది. కొద్దిరోజులు గడిచాయి. ఓ రోజు సారపక్షి సాయంకాలం గూడు చేరుకుంది. అప్సుడు పిల్లలు బితుకు బితుకుమంటూ ఇలా చెప్పాయి. మనం వెంటనే ఈ చేను వదిలివెళ్లాలి. ఈ రోజు రైతు మళ్లి వచ్చుడు. ఊళ్లోని రైతులు చాలా స్వార్ధపరులు నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు. నేను నా అన్నతమ్ముల్ని పిలిపించి వాళ్ళతో పంట కోయిస్తాను. సారపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది. ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు. నాలుగైదు రోజుల్లో మీరు ఎంచక్కా ఎగరగలరు. ఇప్పడిప్పుడే మనం పొలం విడిచి మరో చోటికి పోనక్కర్లేదు. ఇలా మరి కొన్ని రోజులు గడిచి పొయ్యాయి. సారపక్షి పిల్లలు బాగా ఎగరసాగాయి. వాటికి భయం లేకుండా పోయింది. ఓ సాయంకాలం అవి సారపక్షితో ఇలా అన్నాయి. ఈ రైతు మమ్మల్ని ఉత్తుత్తినే భయపెడ్తున్నాడు. ఇతడు పైరు కోసినట్లే ఈ రోజు కూడా వచ్చాడు. అన్నాడు కధా. నా అన్నతమ్ములు నా మాట వినడం లేదు. ఏదో ఓ నేపంతో తప్పింకొంటున్నారు. పైరు బాగా ఎండిపోయి గింజలు నేల రాలిపోతున్నాయి. రేపు పొద్దు పొడవగానే నేనే వచ్చి కోత మొదలెడ్తాను. అప్పుడు సారపక్షి భయపడుతుంది. అరరే! వెంటనే బయలు దేరండి, ఇంకా చీకటి పడలేదు. మరో చోటికి వెళ్లాలి రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటీ .. సారపక్షి ఇలా బదులు చెప్పింది. రైతు గ్రామస్తులను సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలుగలేదు. తనపని తాను చేయకుండా, ఇతరులు చేసి పెడ్తారని అనుకున్నంత కాలం ఎవరి పనులు జరగవు. కాని ఎవరంతకు వారు, తమ పనులు చేసుకోవాలని నిర్ణయించుకొన్నప్పడు. చకచకా సాగిపోతాయి. రైతు తానే రేపు పంట కోస్తానని అన్నప్పడు, ఆపని తప్పకుండా జరిగిపోతుంది. సారసపక్షులు పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన చోటుకి ఎగిరిపోయ్యాయి. నీతి : సొంతకాళ్లమీద నిలబడితేనే పనులు సజావుగా సాగుతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: