ఒక అడవిలో ఒక సింహం ఉంది. ఆ అడవిలోనే ఒక చిట్టెలుక కూడా ఉంది. ఒకనాడు సింహం చెట్టు కింద పడుకొని ఉండగా, పక్కనే ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటు ఇటూ పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం ఒక్కసారి పంజా విధిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడ వణుకుతూ ‘‘ మృగరాజా! నేను చిన్న ప్రాణిని, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు. ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను.’’ అన్నది దీనంగా. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి ‘‘ ఏమన్నావూ! నా కాలిగోరంత లేవు ! ఈ అడవికి రాజునైన నేనెక్కడ ? ఊదితే గాలికి కొట్టుకుపోయేలాంటి నీవు ! నాకు బదులు ఉపకారం చేస్తావా ? ఎంత విచిత్రం ! సరేలే! పో! అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది. బ్రతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్ళ తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకున్నది. వల తాళ్ళు గట్టిగా వుండడంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొంత సేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో, ప్రాణమే తీస్తాడో నని విచారించసాగింది. సింహం అటువైపు పరుగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితి చూసింది. అయ్యోపాపం పులిరాజా అని జాలిపడింది. వల తాళ్ళను తన వాడి దంతాలతోగబగబ కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్శర్యపోయింది. అల్పప్రాణులు కూడా గొప్ప సహాయం చేస్తాయి. అని అనాడే తెలసుకొని సంతోషించింది. వలతాళ్లు కొరకడంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టిలుక ముఖం చూడటానికి సింహానికి సిగ్గనిపించింది. ఒక నాడు నేను నిన్ను నా కాలిగోటితో సమానమన్నాను. ఈసడించుకున్నాను ఈ రోజు నీవే నా ప్రాణం కాపాడావు! నన్ను క్షమించు అన్నది సింహం. ఆనాటి నుండి అవి స్నేహంగా జీవించినవి. ఈ కథలోని నీతి : ఎంత చిన్నవారినైనా కించపరచకూడదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: