ఒక ఊళ్లో ఒక రైతు తన కొడుక్కి శ్రమ తెలియకుండా ఇంట్లో పనిపాటలు బాగా చేసే ఒక మంచి పిల్లతో పెళ్లి చేయదలుచుకున్నాడు. ఎద్దుల బండి నిండా రేగు పళ్ళు నింపుకుని చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకోడానికి బయలు దేరాడు. వీధులవెంట బండిని తోలుకుంటూ, పళ్ళో పళ్ళు రేగుపళ్ళు చెత్తకు పళ్ళు అని అమ్ముతున్నాడు. ప్రతి ఇంట్లోను ఆడవాళ్లు ఆడపిల్లలు, ములసలమ్మలు అందరూ త్వరత్వరగా తమ తమ ఇళ్ళోను, వాకిళ్లను ఊడ్చడం మొదలుపెట్టారు. చెత్త పోగుచేసి ఎవరికి వీలైన దాంట్లో వారు దాన్ని ఎత్తారు. ఒక గృహిణి పెద్ద గోనె సంచి నిండా చెత్త తీసుకువచ్చింది. ఇంకో అమ్మాయి గంపనిండా, మరో అమ్మాయి కొంగు నిండా కట్టకు వచ్చింది. వాళ్ళ వాళ్ల ఇళ్ళలో చెత్త చెదారం ఊడ్చుకువచ్చి చూడు నేనెంత చెత్త పోగు చేసుకొచ్చానో? మంచిదే అయింది ఎవడో పిచ్చివాడు చెత్తకు పళ్లు అమ్ముతున్నాడు. అని చెప్పుకుంటున్నారు. రైతు ఆ చెత్తను పోగు చేసుకొని దానికి బదులుగా పళ్ళు ఇస్తున్నాడు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి చిన్నపళ్ళెములో తాను ఊడ్చిన చెత్తను తీసుకువచ్చింది. ఏంటి అమ్మడూ, నువ్వు చాలా తక్కువ తీసుకువచ్చావు ఈ కాస్త చెత్తకు ఎన్ని పంళ్లు ఇవ్వమంటావు. అన్నాడు పళ్ళు పళ్లు అమ్మేవాడు. అయ్యా ఇది మా ఇంటిది కాదు. మా ఇంట్లో అసలు చెత్త లేనే లేదు. ఇది కాస్తా ప్రక్క ఇంట్లో వాళ్ళకు చెత్త ఊడ్చి పెట్టినందుకు నాకు ఇచ్చారు అన్నది ఆ అమ్మాయి. ఆ మాట వినడంతోనే పళ్ళు అమ్మేవాడికి ఎంతో సంతోషం కలిగింది. వళ్లువంచి బాగా పనిచేసే అమ్మాయి ఈవిడే. వాళ్ల ఇంట్లో చెత్త లేనే లేదు. నా కొడుక్కి సరైన భార్య అని ఆ పిల్లను కోడలుగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: