ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న చైనా టెక్‌ కంపెనీ లెనోవో ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ల్యాపీని ఆవిష్కరించింది. 

ఇప్పటివరకూ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లు, టీవీలను చూశాం. తాజాగా మడతపెట్టే ల్యాప్‌టాప్‌లురానున్నాయి.
 ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ పీసీ అని లెనోవో కంపెనీ చెబుతోంది.
ల్యాప్‌టాప్‌ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుందీ డివైస్‌. ఫోల్డబుల్‌ స్క్రీన్‌తో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ ల్యాప్‌టాప్‌ అని కంపెనీ తెలిపింది.

 ఎలాంటి ఫీచర్స్‌ ఉంటాయంటే...? 

9.3 ఇంచీల స్క్రీన్‌, ఇంటెల్‌ ప్రాసెసర్‌, యూఎస్‌బీ పోర్ట్స్‌, ఇన్‌ఫ్రార్డ్‌ కెమెరా, స్టీరియో స్పీకర్స్‌, హై-రిజల్యూషన్‌ డిస్‌ ప్లే, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ప్రధాఫీచర్లుగా ఉన్నాయి.
 13.3 అంగుళాల పరిమాణంలో ల్యాపీని తీర్చిదిద్దారు. 2020 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రావాలని ప్లాన్‌ చేస్తున్నామని పేర్కొంది.
ధర విషయానికి వస్తే, మూడు నుంచి 4వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. 


మరింత సమాచారం తెలుసుకోండి: